ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Kotak Bank Account: చనిపోయిన మహిళ అకౌంట్లో లక్ష కోట్లు డిపాజిట్.. షాక్ అయిన కొడుకు..

ABN, Publish Date - Aug 05 , 2025 | 06:52 AM

Kotak Bank Account: బ్యాంకు ఖాతాలో అంత డబ్బు పడ్డం నిజమేనని, పెద్ద మొత్తం డబ్బులు ఖాతాలో పడ్డం కారణంగా అకౌంట్ ఫ్రీజ్ చేశామని వారు చెప్పారు. అంతేకాదు.. బ్యాంకు అధికారులు ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌ను కూడా అలర్ట్ చేశారు.

Kotak Bank Account

చనిపోయిన ఓ మహిళ అకౌంట్లోకి ఏకంగా లక్ష కోట్ల రూపాయలు డిపాజిట్ అయ్యాయి. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో ఆదివారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..నోయిడా, దన్‌కౌర్ ప్రాంతానికి చెందిన గాయత్రి దీవీ రెండు నెలల క్రితం చనిపోయింది. ప్రస్తుతం ఆమె ఫోన్‌ను కొడుకు దీపక్ వాడుతున్నాడు. ఆదివారం రాత్రి అతడికి ఓ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చూసి అతడు షాక్ అయ్యాడు. తల్లి అకౌంట్లోకి 1001356000000000000100235600000000299 డబ్బు డిపాజిట్ అయిందని ఆ మెసేజ్‌లో ఉంది.

అతడికి ఏమీ అర్థం కాలేదు. వెంటనే యూపీఐ యాప్ ఓపెన్ చేసి చూసుకున్నాడు. అందులో నిజంగానే అంత డబ్బు పడిందని ఉంది. ఆ నెంబర్లను లెక్కబెట్టి.. అది ఎంతో తెలుసుకోవడానికి అతడికి కష్టంగా మారింది. వెంటనే ఫ్రెండ్స్‌కు మెసేజ్ పంపి ఆ మొత్తం ఎంతో అడిగాడు. అది 1.13 లక్షల కోట్లను తెలిసి అందరూ అవాక్ అయ్యారు. తల్లి ఖాతాలో అంత డబ్బుపడ్డం నిజమా కాదా అని తెలుసుకోవడానికి మరుసటి రోజు దీపక్ బ్యాంకుకు వెళ్లాడు. బ్యాంకు సిబ్బంది అకౌంట్ చెక్ చేశారు.

బ్యాంకు ఖాతాలో అంత డబ్బు పడ్డం నిజమేనని, పెద్ద మొత్తం డబ్బులు ఖాతాలో పడ్డం కారణంగా అకౌంట్ ఫ్రీజ్ చేశామని వారు చెప్పారు. అంతేకాదు.. బ్యాంకు అధికారులు ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌ను కూడా అలర్ట్ చేశారు. ఇన్‌కమ్ టాక్స్ అధికారులు ఆ డబ్బులు ఎక్కడినుంచి వచ్చాయన్నదానిపై ఎంక్వైరీ మొదలెట్టారు. బ్యాంకు వైపు నుంచి టెక్నికల్ సమస్య లేదా మనీ ల్యాండరింగ్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక, దీపక్ తల్లి ఖాతాలోకి లక్ష కోట్లు పడ్డ విషయం బంధువులు, ఊర్లో వాళ్లకు తెలిసింది. దీపక్‌కు ఫోన్ చేసి ఆరా తీయటం మొదలెట్టారు. పెద్ద సంఖ్యలో ఫోన్ కాల్స్ వస్తుండటంతో అతడు ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు.

స్పందించిన కోటక్ మహీంద్ర..

చనిపోయిన మహిళ బ్యాంక్ ఖాతాలో 1.13 లక్షల కోట్లు పడినట్లు వస్తున్న వార్తలపై కోటక్ మహీంద్ర బ్యాంక్ స్పందించింది. ఆ క్రమంలో ఒక ప్రకటన విడుదల చేసింది. అది అవాస్తవమని ఆ బ్యాంక్ యాజమాన్యం స్పష్టం చేసింది. ఖాతాదారుడి ఖాతాలో అసాధారణ రీతిలో భారీగా నగదు ఉందంటూ పేర్కొన్న మీడియా కథనాలు తప్పని పేర్కొంది. ఈ నివేదికల దృష్ట్యా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా నెట్ బ్యాంకింగ్‌లను ఉపయోగించే ఖాతాదారులు.. తమ తమ ఖాతాలను ఒకసారి తనిఖీ చేసుకోవాలని సూచించింది. తమ బ్యాంకింగ్ వ్యవస్థ సక్రమంగా పని చేస్తుందని తెలిపింది. అలాగే అన్ని సేవలు సురక్షితంగా... పూర్తిగా పని చేస్తున్నాయని కోటక్ మహీంద్ర బ్యాంక్ యాజమాన్యం విడుదల చేసిన ప్రకటనలో ధృవీకరించింది.

ఇవి కూడా చదవండి

గ్రానైట్‌ క్వారీని పరిశీలించిన ఒడిశా బృందం

గాజాలో యుద్ధాన్ని ఆపండి..!

Updated Date - Aug 06 , 2025 | 06:05 PM