ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

AC Precautions: ఏసీ ఉన్న గదిలో బకెట్‌తో నీళ్లు పెట్టుకోవాలి.. ఇలా ఎందుకో తెలుసా

ABN, Publish Date - Jun 16 , 2025 | 10:59 PM

ఏసీ ఉన్న గదిలో కచ్చితంగా బకెట్ నీరు పెట్టుకోవాలని నిపుణులు చెబుతుంటారు. ఇలా ఎందుకో ఈ కథనంలో కూలంకషంగా తెలుసుకుందాం.

AC room humidity

ఏసీ ఓ నిత్యావసరంగా మారిపోయిన రోజులు ఇవి. ఉక్కపోత, వేడి నుంచి ఏసీ తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది. అయితే, నిరంతరం ఏసీలో గడిపితే కొన్ని అనారోగ్యాల బారిన కూడా పడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సమస్యలన్నిటికీ ఒకే ఒక పరిష్కారం ఏసీ గదిలో బకెట్ నీళ్లు పెట్టుకోవడమే అని కూడా చెబుతున్నారు. మరి ఏసీ గదిలో బకెట్ నీళ్లతో కలిగే ఉపయోగాలు ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.

ఏసీ కారణంగా గదిలోని వాతావరణం పొడి బారుతుంది. గాలిని ఏసీ చల్లబరిచే క్రమంలో తేమ శాతం కూడా తగ్గుతుంది. దీంతో, ఏసీలో ఎక్కువ సేపు ఉండే వారిలో చర్మం పొడిబారడం, దురదలు, పెదవులపై పగుళ్లు, కళ్ల దురదలు, గొంతు, ముక్కులో అసౌకర్యం వంటి సమస్యలు వేధిస్తాయి. ఇక సైనస్ వంటి వ్యాధులు ఉన్న వారికి ఏసీలో నరకం తప్పదు. ఈ సమస్యలన్నిటినీ గదిలో బకెట్ నీటిని పెట్టుకోవడం ద్వారా పరిష్కరించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

బకెట్‌లోని నీరు సహజసిద్ధమైన హ్యూమిడిఫయ్యర్‌లా పనిచేస్తుంది. నీరు క్రమంగా ఆవిరిగా మారి గాల్లో తేమ శాతం ఆరోగ్యకర స్థాయిలో కొనసాగేలా చేస్తుంది. దీంతో, చర్మం పొడిబారదు. శ్వాస సంబంధిత సమస్యలు కూడా దరిచేరవు. రాత్రిళ్లు నిద్ర కూడా బాగా పడుతుంది. హ్యూమిడిఫయ్యర్‌ల లాగా గదిలో భారీ శబ్దం కూడా ఉండదు.

గాల్లో తేమ శాతం తగ్గడం ఆరోగ్యంపైనే కాకుండా పర్యావరణంపైన కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల ఇంట్లో చెక్క ఫర్నీచర్‌లో పగుళ్లు ఏర్పడతాయి. ఇంట్లోని మొక్కలు కూడా వడిలిపోతాయి. ఇలాంటప్పుడు గదిలో బకెట్ నీరు పెట్టుకుంటే సమస్య చిటికెలో పరిష్కారం అవుతుంది. స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ముప్పు కూడా తగ్గుతుంది.

ఏసీ గదిలో నిద్రిస్తున్నప్పుడు కొందరిలో గొంతు తడారిపోయి పలుమార్లు మెళకువ వస్తుంది. ఫలితంగా మరునాడు ఉదయం అలసటతో నిద్ర లేవాల్సి వస్తుంది. అదే గదిలో బకెట్ నీరు గనక ఉంటే, గాల్లో తేమ శాతం నిలకడగా ఉండి కంటి నిండా నిద్రపడుతుంది. మరుసటి రోజు ఉత్సాహంగా నిద్ర లేవగలుగుతారు. అయితే, గదిలో ఓ మూలన లేదా కిటికీకి పక్కన బకెట్ నీటిని పెట్టాలని నిపుణులు చెబుతున్నారు. గాలి బాగా వీచే ప్రదేశంలో బకెట్ ఉండాలి. సువాసన కోసం బకెట్‌లో మీకు నచ్చిన ఆయిల్ లేదా నిమ్మ పెచ్చులు కూడా వేయొచ్చు. ఇది సింపుల్ టెక్నిక్ అయినా కూడా ఫలితాలు మాత్రం ఊహించనంత మెరుగ్గా ఉంటాయని అనుభవజ్ఞులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

ఇంట్లో మట్టి కుండలు ఉన్నాయా.. ఈ విషయాలు తెలుసుకోవడం తప్పనిసరి

వానాకాలంలో ఇంట్లోకి పాములు రాకుండా ఉండాలంటే..

మరిన్ని లైఫ్ స్టైల్ కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 16 , 2025 | 11:56 PM