Share News

Earthen Pot: ఇంట్లో మట్టి కుండలు ఉన్నాయా.. ఈ విషయాలు తెలుసుకోవడం తప్పనిసరి

ABN , Publish Date - Jun 16 , 2025 | 08:34 AM

నీటి నిల్వ కోసం మట్టి కుండలు వాడే వారు తీసుకోవాల్సి జాగ్రత్తలు అనేకం ఉన్నయి. అవేంటో ఈ కథనంలో కూలంకషంగా తెలుసుకుందాం.

Earthen Pot: ఇంట్లో మట్టి కుండలు ఉన్నాయా.. ఈ విషయాలు తెలుసుకోవడం తప్పనిసరి
Earthen Pot Water Storage Safety

ఇంటర్నెట్ డెస్క్: మట్టి కుండల్లో నీటిని నిల్వ ఉంచడం భారత్‌లో తరతరాలుగా వస్తున్న అలవాటు. పర్యావరణ హితమైన ఈ పద్ధతిలో నీటిని సహజసిద్ధంగా చల్లబరుచుకోవచ్చు. ప్లాస్టిక్, మెటల్ కంటెయినర్‌లతో వచ్చే సమస్యలేవీ మట్టి కుండల వినియోగంతో ఉండవు.

కుండల విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. లేని పక్షంలో బ్యాక్టీరియా పేరుకుని అనారోగ్యాలు కలిగే అవకాశం పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. నిపుణులు చెప్పే దాని ప్రకారం, కుండల నిర్వహణపై దృష్టి పెట్టాలి. కొత్త కుండ కొనగానే అందులో నీళ్లు పోసుకుని తాగడం కూడా మంచిది కాదు.


అనుభవజ్ఞులు చెప్పే దాని ప్రకారం, కొత్త కుండను ముందుగా కనీసం ఒక రోజు పాటు నీళల్లో నానబెట్టాలి. ఆ తరువాత పీచుతో బాగా కడిగి ఎండలో పూర్తిస్థాయిలో ఆరబెట్టాకే వినియోగించడం ప్రారంభించాలి. నీటిలో నాన బెట్టడం వల్ల కుండలోని సూక్ష్మ రంధ్రాలన్నీ శుభ్రమవుతాయి. ఆ తరువాత ఎండలో పెట్టడం వల్ల సూక్ష్మక్రిములు నశించిపోతాయి.

కొత్త కుండను ఉప్పు లేదా బేకింగ్ సోడా వేసి బాగా తోమాలని కూడా నిపుణులు చెబుతున్నారు. దీంతో, కుండ పూర్తిస్థాయిలో డిస్‌ఇన్‌ఫెక్ట్ అవుతుంది. ఇలా కుండను కడిగేందుకు వేడి నీటిని మాత్రమే వాడాలి. బ్రష్‌తో తోమితే మరింత ఫలితం ఉంటుంది. సబ్బులు, డిటర్జెంట్‌లు గ్రహించే గుణం మట్టికి ఉంటుంది కాబట్టి వీటిని కుండలు శుభ్రం చేసేందుకు అస్సలు వినియోగించొద్దు.


కుండల్ని రోజుకు ఒకసారన్నా కడగాలి. నీటిని గరిష్ఠంగా నాలుగు రోజులకు మించి నిల్వ ఉంచకూడదు. నీటిని మార్చిన ప్రతిసారీ కుండను బాగా కడగడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. రోజూ ఇలా చేస్తే మరింత బెటర్. ఈ చిన్న అలవాటుతో బ్యాక్టీరియా ముప్పును చాలా వరకూ తగ్గించుకోవచ్చు. నిమ్మరసం, బేకింగ్ సోడా కలిపి చేసిన పేస్టుతో వారానికి ఒకసారి కుండను బాగా రుద్ది కడగాలని కూడా నిపుణులు చెబుతున్నారు. ఆ తరువాత ఎండలో ఆరబెడితే సూక్ష్మ క్రిములు పూర్తిస్థాయిలో తొలగిపోతాయి. నీటిని నింపే ముందు ప్రతిసారీ కుండను శుభ్రంగా కడిగితే అనారోగ్యాలు ఏవీ దరిచేరవు.

ఇవి కూడా చదవండి:

వానాకాలంలో ఇంట్లోకి పాములు రాకుండా ఉండాలంటే..

అర్ధరాత్రి వేళ విమాన టిక్కెట్లు బుక్ చేస్తే తక్కువ ధర..

మరిన్ని లైఫ్ స్టైల్ కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 16 , 2025 | 08:45 AM