ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Train Your Brain: విజయం కోసం తపిస్తున్నారా.. ఈ టిప్స్ పాటిస్తే గెలుపు మీదే

ABN, Publish Date - Jul 24 , 2025 | 11:47 PM

విజయం సాధించేందుకు సరైన మానసిక దృక్పథం కూడా అవసరం. మరి ఇందుకు అనుగుణంగా మెదడుకు ఎలాంటి ట్రెయినింగ్ ఇవ్వాలో ఈ కథనంలో తెలుసుకుందాం.

brain training tips

ఇంటర్నెట్ డెస్క్: విజయం కోసం కేవలం కష్టపడి పనిచేస్తే సరిపోదు. అంతుకుమించి అనేక నైపుణ్యాలు అవసరం. సరైన దృక్పథం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు వంటివి అనేకం అవసరం పడతాయి. మరి విజయం కోసం పాటించాల్సిన టిప్స్ ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం.

లక్ష్యంపై స్పష్టత విజయానికి తొలి మెట్టు. ముందుగా చిన్న లక్ష్యాలను ఎంచుకుని వాటిని ఓ నిర్దిష్ట కాలపరిమితిలోపల పూర్తి చేయాలి.

మీరు అందుకోవాలనుకుంటున్న విజయాన్ని పదే పదే మననం చేసుకోవాలి. మనసులోనే దర్శించగలగాలి. ఇది మీ మానసిక దృక్పథాన్ని విజయానికి అనుకూలంగా మారుస్తుంది.

సవాళ్లంటే భయపడొద్దు. కొత్త విషయాలను నేర్చుకునేందుకు అవకాశాలుగా భావించాలి. దీంతో, ఉన్నతమైన వ్యక్తిత్వం సొంతమవుతుంది.

కొత్త విషయాలను నేర్చుకునేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. పుస్తకాలు చదవడం, కొత్త కోర్సులు నేర్చుకోవడం వంటివి క్రమం తప్పకుండా చేయాలి. ఇది మీ మెదడును షార్ప్‌గా ఉంచుతుంది.

వాస్తవం ఉన్న విషయాలపై దృష్టి పెట్టడం, ధ్యానం ద్వారా ఏకాగ్రతను పెంచుకోవాలి. దీంతో, రోజంతా పనిపై దృష్టిపెట్టగలిగేలా స్థిరత్వం వస్తుంది.

మెదడును పదును పెట్టేందుకు చెస్, పజిల్స్ వంటివి దోహదపడతాయి. తెలివితేటలు పెరుగుతాయి.

ప్రతి రోజూ చేయాల్సిన పనులకు సంబంధించి ఓ షెడ్యూల్ రూపొందించుకుని దాన్ని తూచా తప్పకుండా పాటించాలి. ఇది క్రమశిక్షణ నేర్పుతుంది. మిమ్మల్ని లక్ష్యానికి చేరువ చేస్తుంది.

ఎక్సర్‌సైజులతో శారీరక ప్రయోజాలతో పాటు మానసిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మెదడు పనితీరు మెరుగవుతుంది. మెదడుకు మేలు చేసే ఫుడ్స్‌ను కూడా తినాలి.

సానుకూల దృక్పథం కలిగిన మనుషుల మధ్య ఉంటే మనకూ ఈ మానసిక ఆలోచనా ధోరణి అలవడుతుంది.

ఇక ఎంత ఒత్తిడిని ఎదుర్కుంటున్నా సరే ప్రశాంతత కోల్పోకూడదు. కాబట్టి ఒత్తిడి తగ్గించుకునేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి:

నా కుమారుడు రోజూ ఉదయం 4 గంటలకే నిద్ర లేస్తాడు: నటుడు మాధవన్

40 ఏళ్లు దాటిన పురుషులు జిమ్‌లో కసరత్తులతో కండలు పెంచగలరా

Read Latest and Health News

Updated Date - Jul 25 , 2025 | 06:56 AM