Forgot luggage In Bus: బస్సులో మీ లగేజీ మరిచిపోయారా.. టెన్షన్ పడకండి.. ఇలా చేస్తే చాలు..
ABN, Publish Date - Jul 07 , 2025 | 01:05 PM
చాలా మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేటప్పుడు లగేజీ మర్చిపోతుంటారు. అయితే, అలాంటి సమయంలో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, దీనికి ఒక సింపుల్ సొల్యూషన్ ఉంది. జస్ట్ ఇలా చేస్తే చాలు.. మరచిపోయిన లగేజీని ఈజీగా తెచ్చుకోవచ్చు..
Forgot luggage In Bus: పల్లెల నుంచి పట్టణాల వరకు ఆర్టీసీ బస్సుల్లో చాలా మంది ప్రయాణిస్తుంటారు. అయితే, ప్రయాణాల సమయంలో కొన్నిసార్లు ఊహించని పరిస్థితులు ఎదరవుతుంటాయి. మరీ ముఖ్యంగా బస్సు దిగే హడావుడిలో పడి చాలా మంది తమ లగేజీ మరిచిపోతుంటారు. తీరా బస్సు వెళ్లిపోయాక లగేజీ మరచిపోయను అని నెత్తి నోరు బాదుకుంటారు. అయితే, అలాంటి సమయంలో మీరు బాధపడాల్సిన అవసరం లేదు. లగేజీ పోయిందని టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎందుకంటే, దీనికి ఒక సింపుల్ సొల్యూషన్ ఉంది. అదేమిటంటే..
మీరు ముందుగా కంగారు పడకుండా ఆ బస్సు ఏ డిపోదో తెలుసుకోండి . బస్సు టికెట్‌పై ఉన్న డ్రైవర్ లేదా కండక్టర్ ఐడీ నంబర్‌ను గుర్తించండి. టికెట్‌పై కచ్చితంగా ఈ ఇద్దరిలో ఒకరి ఐడీ కంపల్సరీగా ఉంటుంది. లేదా ఇద్దరి ఐడీలు కూడా ఉండవచ్చు. సంబంధిత డిపో అధికారులకు కాల్ చేయండి. వారు మిమ్మల్ని డ్రైవర్ లేదా కండక్టర్ ఐడీ నెంబర్ అడుగుతారు. మీ టికెట్‌పై ఉన్న ఐడీ నెంబర్ చెబితే వారు కంప్యూటర్‌లో చెక్ చేసి మీకు డ్రైవర్ లేదా కండక్టర్ ఫోన్ నంబర్లు ఇస్తారు.
అప్పుడు మీరు ఆ నంబర్లకు ఫోన్ చేసి బస్సులో మర్చిపోయిన మీ లగేజీ విషయం చెప్పండి. అప్పటికి మీ లగేజీ ఎవరూ తీసుకెళ్లకుండా ఉంటే.. మీరు వచ్చే వరకు వారు మీ లగేజీని భద్రంగా ఉంచుతారు. ఆ తర్వాత మనం వాళ్లు చెప్పిన ప్లేస్‌కు వెళ్లి తిరిగి మన లగేజీని తెచ్చుకోవచ్చు. ఇలా మీ ప్రాబ్లం సింపుల్‌గా సాల్వ్ అవుతుంది. కాబట్టి, ఇప్పటి నుంచి మీరు ఎప్పుడైనా బస్సులో లగేజీ మరిచిపోతే కంగారు పడకుండా పైన చెప్పిన పద్దతిని ఫాలో అవ్వండి. ఈజీగా మీ లగేజీ తిరిగి పొందవచ్చు.
Also Read:
బెడ్ రూమ్‌లో దేవుళ్ల చిత్రాలను ఉంచవచ్చా.. ఈ నియమాలు తెలుసుకోండి..
వెండి ఆభరణాలతో అద్భుతమైన ప్రయోజనాలు..!
For More Lifestyle News
Updated Date - Jul 07 , 2025 | 01:05 PM