ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Laptop Cleaning Tips: స్క్రీన్ దెబ్బతినకుండా.. ల్యాప్‌టాప్‌ను శుభ్రం చేయడం ఎలా..

ABN, Publish Date - May 22 , 2025 | 04:10 PM

ఎలెక్ట్రానిక్ వస్తువులను క్లీన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చిన్న పొరపాటు చేసినా భారీ నష్టం ఎదుర్కొవాల్సి వస్తుంది. ముఖ్యంగా, ల్యాప్‌టాప్‌ను క్లీన్ చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

Laptop

Laptop Cleaning Tips: ల్యాప్‌టాప్ క్లీన్ చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే చిన్న పొరపాటు చేసినా పెద్ద నష్టం కలుగుతుంది. అయితే, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీ ల్యాప్‌టాప్ పనితీరు బాగుంటుంది. అంతేకాకుండా, ల్యాప్‌టాప్ ఎక్కువ కాలం పాటు ఉపయోగించుకోవచ్చు. కాబట్టి, ల్యాప్‌టాప్‌ను శుభ్రంగా ఉంచాలి, వేడెక్కకుండా చూసుకోవాలి. దీనిని సరైన రీతిలో ఉపయోగించడం చాలా ముఖ్యం. అలాగే, ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకుని వాడటం ఏ మాత్రం మంచిది కాదు. ల్యాప్‌టాప్‌ను ప్రతిరోజూ శుభ్రం చేయాలి. కీబోర్డు, స్క్రీన్‌పై దుమ్ము, మురికి లేకుండా చూసుకోవాలి. కాబట్టి, స్క్రీన్ దెబ్బతినకుండా ల్యాప్‌టాప్‌ శుభ్రం చేయడం ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం..


మీ ల్యాప్‌టాప్ స్క్రీన్‌ను శుభ్రం చేయడానికి ముందుగా ల్యాప్‌టాప్‌ను ఆఫ్ చేయండి. స్క్రీన్‌ను శుభ్రం చేయడానికి మైక్రోఫైబర్ వంటివి మృదువైన వస్త్రంను ఉపయోగించండి. శుభ్రం చేసేటప్పుడు స్క్రీన్‌పై ఎక్కువ ఒత్తిడి పెట్టి రుద్దకండి. ఎట్టిపరిస్థితిలోనూ కఠినమైన రసాయనాలు ఉపయోగించవద్దు. అమ్మోనియా, బ్లీచ్, విండో క్లీనర్, లేదా ఇతర కఠినమైన రసాయనాలు వాడి స్క్రీన్‌ను దెబ్బతీయవచ్చు. అంతేకాకుండా దాని హార్డ్‌వేర్ కూడా దెబ్బతింటుంది. కాబట్టి వాటిని ఉపయోగించకుండా ఉండండి. కాటన్ గుడ్డతో మృదువుగా స్క్రీన్‌ను తుడవండి. కొన్ని సందర్భాల్లో మీరు స్క్రీన్‌ను తుడిచే ముందు కొద్దిగా నీరు లేదా స్క్రీన్ క్లీనర్ ఉపయోగించవచ్చు. స్క్రీన్ ఆరిపోయిన తర్వాత ల్యాప్‌టాప్‌ను మళ్లీ ఆన్ చేయండి.


తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

  • స్క్రీన్‌ను తుడిచేటప్పుడు ఎక్కువ నీరు ఉపయోగించకండి.

  • నీరు ల్యాప్‌టాప్ లోపలికి వెళ్లకుండా జాగ్రత్త తీసుకోండి.

  • ల్యాప్‌టాప్‌ ఆఫ్ చేసేటప్పుడు కీబోర్డ్‌పై కవర్‌ ఉపయోగించండి.

  • ఇది దుమ్ము, మరకలను నివారించడంలో సహాయపడుతుంది.

  • మరకలు, ముద్రలను తొలగించడానికి ప్రత్యేక స్క్రీన్ క్లీనర్లను ఉపయోగించవచ్చు.

  • స్క్రీన్‌ను దెబ్బతీయకుండా ఉండే రసాయనాలు, వస్తువులను ఉపయోగించండి.


Also Read:

ప్రాణం పోయినా.. మందు పోకూడదు.. ఎలా తాగుతున్నాడంటే..

జస్ట్ రూ. 25 తో దేశం మొత్తం చుట్టేయొచ్చు

For More Telugu And National News

Updated Date - May 22 , 2025 | 04:18 PM