Rain Bath Benefits: వర్షపు నీటిలో స్నానం.. ఆరోగ్యానికి మంచిదేనా..
ABN, Publish Date - May 22 , 2025 | 08:17 PM
చాలా మందికి వర్షపు నీటిలో స్నానం చేసే అలవాటు ఉంటుంది. అయితే, ఇలా స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిదేనా? దీని వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
వర్షపు నీటిలో స్నానం చేయడం అంటే చాలా మందికి ఇష్టం. వర్షంలో తడుస్తూ హ్యాపీగా ఎంజాయి చేస్తారు. కొంతమందికి ఇది అలవాటుగా ఉంటుంది. అయితే, ఇలా స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిదేనా? దీని వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
వర్షం మనసుకు ప్రశాంతతను ఇవ్వడమే కాకుండా, శరీరాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆయుర్వేదం ప్రకారం, వర్షంలో స్నానం చేయడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది శరీరాన్ని, మనసును రిఫ్రెష్ చేస్తుంది. చర్మంపై పేరుకుపోయిన దుమ్ము, ధూళిని తొలగిస్తుంది. అంతేకాకుండా, వర్షపు నీరు వేడి సంబంధిత సమస్యలను నివారించడంలో సహాయపడుతుందని ఒక అధ్యయనం చెబుతోంది.
వర్షపు నీటిలో pH స్థాయి తక్కువగా ఉండటం వల్ల ఇది కొంచెం తేలికగా ఉంటుంది. వర్షపు నీటిలో స్నానం చేయడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు, సెరోటోనిన్ హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి ఆనందానికి కారణమవుతాయి. ఇది నేటి ఒత్తిడితో కూడిన జీవితంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీని వల్ల మనశ్శాంతి లభిస్తుంది. తీవ్రమైన వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
వర్షపు నీటిలో స్నానం చేయడం వల్ల చర్మపు దద్దుర్లు, దురద లేదా అలెర్జీ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందని చర్మ నిపుణులు అంటున్నారు. వర్షపు నీరు చల్లగా ఉండటం వల్ల, అది రక్త నాళాలకు అనువైన ఉష్ణోగ్రతను నిర్వహిస్తుంది.
Also Read:
Waqf Bill: వక్ఫ్ బిల్లు సవరణ చట్టంపై తీర్పు రిజర్వ్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన న్యాయమూర్తి
CM Chandrababu: ఢిల్లీలో రెండురోజుల పాటు సీఎం చంద్రబాబు పర్యటన
For More Telugu ANd National News
Updated Date - May 22 , 2025 | 08:32 PM