ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Beauty Tips: యవ్వనంగా కనిపించడానికి ఈ కొరియన్ టిప్స్ ప్రయత్నించండి..

ABN, Publish Date - May 26 , 2025 | 07:07 PM

వయసు పెరిగే కొద్దీ మన శరీరంలో సహజంగా ఉత్పత్తి అయ్యే కొల్లాజెన్ తగ్గుతుంది. దీని వలన మన చర్మం ముడతలు, పొడిబారడినట్లు కనిపిస్తుంది. అయితే, యవ్వనంగా కనిపించడానికి ఈ కొరియన్ టిప్స్ ట్రై చేయండి.

Beauty Tips

వయసు పెరిగే కొద్దీ మన శరీరంలో సహజంగా ఉత్పత్తి అయ్యే కొల్లాజెన్ తగ్గుతుంది. దీని వలన మనం పెద్ద వయసు ఉన్నవారిలా కనిపిస్తాము. మన చర్మం ముడతలు, సన్నని గీతలు, పొడిబారడం వంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక సులభమైన మార్గం ఉంది. అదే కొరియన్ ట్రిక్. అవును, కొరియన్ పద్ధతిలో సహజమైన పదార్థాలు ఉన్నాయి. ఇవి కొల్లాజెన్ ఉత్పత్తిని లోపలి నుండి ప్రేరేపించి కొల్లాజెన్‌ను పెంచుతాయి. వీటిని మీరు మార్కెట్లో కొనాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే వీటిని తయారుచేసుకోవచ్చు.

బోన్ సూప్

కొరియన్లు చర్మానికి ఉత్పత్తులను వాడటం కంటే కూడా సహజ సిద్ధమైన వాటితో తమ చర్మాన్ని అందంగా ఉండేలా చేసుకుంటారు. ఇందుకోసం బోన్ సూప్ తయారు చేసుకుంటారు. బోన్ సూప్ చర్మ దృఢత్వానికి చాలా ఉపయోగపడుతుంది. దీనిని ఎలా చేయాలంటే.. చికెన్ ఎముకలను తీసుకొని, వాటి నుండి కొల్లాజెన్‌ను తీయడానికి 2 టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ జోడించండి. దానికి వెల్లుల్లి, అల్లం, ఉల్లిపాయ, కొరియన్ జిన్సెంగ్ వంటి పదార్థాలను జోడించండి. కుక్కర్‌లో వేసి బోన్స్ స్మాష్ అయ్యేవరకు మరిగించండి. తరువాత దాన్ని వడకట్టి రోజుకు ఒక కప్పు తాగండి.


బియ్యం నీరు

ఇది కొరియన్ మహిళల టాప్ బ్యూటీ సీక్రెట్. సహజ కొల్లాజెన్ బూస్టర్ అయిన బియ్యం నీరు. అమైనో ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు బి, ఇ.. బియ్యం నీరులో ఉంటాయి. ఇవి కణాల పునరుత్పత్తిని ప్రోత్సహిస్తాయి. కప్పు బియ్యం తీసుకుని శుభ్రంగా కడగాలి. బియ్యంను నీటిలో 30 నిమిషాలు నానబెట్టండి. తర్వాత బియ్యం నీటిని ఒక కప్‌లో తీసుకోని రిఫ్రిజిరేటర్‌లో ఉంచండి. దానిని 3-4 రోజులు వాడండి. క్రమం తప్పకుండా వాడటం వల్ల బియ్యం నీరు నల్లటి మచ్చలను తొలగించి, నిగనిగలాడే చర్మాన్ని ఇస్తుంది.


Also Read:

జ్యోతి మల్హోత్రాకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ

స్టార్ హోటళ్లలో చెఫ్‌లు పొడవైన టోపీని ఎందుకు ధరిస్తారో తెలుసా..

For More Lifestyle News

Updated Date - May 26 , 2025 | 07:42 PM