ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Home Remedy: అరటి తొక్కతో దోమలకు చెక్ పెట్టొచ్చని మీకు తెలుసా..

ABN, Publish Date - Jun 17 , 2025 | 06:03 PM

వర్షాకాలంలో సాయంత్రం అయ్యే కొద్దీ దోమలు బెడద ఎక్కువగా ఉంటుంది. అయితే, అరటి తొక్కల సహాయంతో ఇంట్లోకి ఒక్క దోమ కూడా రాకుండా చేయొచ్చని మీకు తెలుసా?

Banana

Home Remedy: దోమలు చాలా ప్రమాదకరమైన కీటకాలు. దోమల వల్ల వైరల్ జ్వరం, డెంగ్యూ, చికున్‌గున్యా మొదలైన అనేక వ్యాధులు వస్తాయి. దోమల ద్వారా సంక్రమించే జ్వరాలు, వ్యాధులు ప్రాణాంతకం కావచ్చు. అయితే, ఎలాంటి రసాయనాలు వాడకుండా కేవలం అరటిపండు తొక్కతోనే దోమలను తరిమికొట్టవచ్చు. అరటి తొక్కను ఉపయోగించి దోమలను ఎలా తరిమికొట్టాలో.. ఇంట్లోకి దోమలు రాకుండా సహజంగా ఎం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

వర్షాకాలంలో దోమలు ఎక్కువగా ఉంటాయి. అయితే, ఇంట్లోకి దోమలు రాకుండా అరటి తొక్కలు చాలా ఉపయోగపడతాయి. పడుకునే గంట ముందు గదిలోని నాలుగు మూలల్లో అరటి తొక్కలను ఉంచాలి. అరటి తొక్కల వాసన దోమలను తరిమికొట్టడంలో సహాయపడుతుంది. మీ ఇంట్లో చిన్న పిల్లలు లేదా శ్వాసకోశ సమస్యలు లేదా ఉబ్బసం ఉన్నవారు ఉంటే మీరు అరటి తొక్కలను ఉపయోగించవచ్చు.

అలాగే, అరటి తొక్క పేస్ట్ దోమలను తరిమికొట్టడంలో సహాయపడుతుంది. అరటి తొక్కలను మెత్తగా పేస్ట్ చేయండి. ఈ పేస్ట్‌ను ఇంట్లోని ప్రతి మూలకు పూయండి. దీని వాసన దోమలను తరిమికొట్టడంలో సహాయపడుతుంది. లేదంటే దోమలు ఉన్న చోట అరటి తొక్కలను ఉంచండి. అరటి తొక్కల వాసన దోమలకు నచ్చదు. దీనివల్ల దోమలు ఇంట్లో రాకుండా ఉంటాయి.

అరటి తొక్కలను కాల్చడం వల్ల కూడా దోమలు పారిపోతాయి. దీని కోసం, అరటి తొక్కలను ఎండబెట్టి నిల్వ చేయండి. ఆ పొడితో ధూపం వేసి ఇంటి అంతటా పొగను వ్యాపించేలా చేయండి. ఈ పొగను దోమలు ఇష్టపడవు. ఈ వాసన, పొగ మీ ఆరోగ్యానికి ఎటువంటి హాని కలిగించదు. కాబట్టి, అరటి తొక్కను దోమల నివారిణిగా ఉపయోగించి చూడండి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)

Also Read:

పెళ్లైన పురుషులు.. ఇతర మహిళల పట్ల ఎందుకు అట్రాక్ట్ అవుతారో తెలుసా..

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో వెలుగులోకి కొత్త వాస్తవాలు

For More Lifestyle News

Updated Date - Jun 17 , 2025 | 06:28 PM