ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Traffic Challan: ఈ డాక్యుమెంట్లు ఉంటే ట్రాఫిక్ చలాన్ నుండి మీరు సేఫ్

ABN, Publish Date - Jun 21 , 2025 | 05:58 PM

డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ డాక్యుమెంట్లు ఉంటే ట్రాఫిక్ చలాన్ ఉండదు. అయితే, మీరు ఏమి తీసుకెళ్లాలి? ఎందుకు తీసుకెళ్లాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

Traffic Challan

Traffic Challan: మీరు ట్రాఫిక్ చలాన్ నుండి తప్పించుకోవడానికి లేదా జరిమానా తగ్గించడానికి, మీ దగ్గర ఈ కింది డాక్యుమెంట్లు తప్పనిసరిగా ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC), ఇన్సూరెన్స్ సర్టిఫికెట్, పొల్యూషన్ అండర్ కంట్రోల్ (PUC) సర్టిఫికెట్, ఇతర అవసరమైన పత్రాలు ఉండాలి. మీరు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ, అన్ని డాక్యుమెంట్లను కలిగి ఉంటే చలాన్ నుండి తప్పించుకోవచ్చు.

డ్రైవింగ్ లైసెన్స్:

డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఒక అధికారిక పత్రం. ఇది ఒక వ్యక్తికి రోడ్డుపై వాహనాన్ని నడపడానికి అనుమతి ఇస్తుంది. దీనిని పొందేందుకు, మీరు మీ ప్రాంతంలోని రవాణా శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. డ్రైవింగ్ పరీక్షలో ఉత్తీర్ణులవ్వాలి. లైసెన్స్ గడువు ముగిసిన తర్వాత దానిని రెన్యువల్ చేయడం అవసరం.  డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తే మోటారు వాహనాల చట్టం ప్రకారం రూ. 5,000 వరకు జరిమానా లేదా మూడు నెలల వరకు జైలు శిక్ష ఉంటుంది.

రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ( RC):

మీ వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC) తప్పనిసరిగా మీ వద్ద ఉండాలి. లేదంటే రూ. 5,000 జరిమానా అలాగే, వాహనాన్ని స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. ఇది మీ వాహనం చట్టబద్ధంగా నమోదు చేయబడిందని, మీ పేరు మీద ఉందని ధృవీకరిస్తుంది. ఇది మీ వాహనం చట్టబద్ధంగా రోడ్డుపై తిరగడానికి అనుమతిని ఇస్తుంది.

ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ :

డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీతో ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలి. ఇది మీ వాహనం బీమా చేయబడిందని రుజువు చేస్తుంది. ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ లేకుండా మీరు డ్రైవ్ చేస్తే జరిమానాలు ఎదుర్కొనే అవకాశం ఉంది.

పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్ (PUC) :

పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్ (PUC ) భారతదేశంలోని అన్ని వాహనాలకు తప్పనిసరి. మీ వాహనం నుండి వెలువడే కాలుష్యం నిర్దేశించిన పరిమితులకు లోబడి ఉందని ఇది ధృవీకరిస్తుంది.

ఇతర అవసరమైన పత్రాలు:

మీరు ప్రయాణిస్తున్న మార్గానికి సంబంధించిన టోల్ ట్యాక్స్ రసీదులు కలిగి ఉండాలి. మీరు పై డాక్యుమెంట్లను మీతో ఉంచుకోవడం ద్వారా ట్రాఫిక్ పోలీసు అధికారి మిమ్మల్ని ఆపినా చలాన్ నుండి తప్పించుకునే అవకాశం ఉంటుంది. జరిమానా కట్టకుండా హ్యాపీగా ట్రావెల్ చేయవచ్చు. ముఖ్యమైన పత్రాలు లేకుండా డ్రైవింగ్ చేస్తే ఎక్కువ ఫైన్ పడుతుంది. కాబట్టి, చట్టబద్ధమైన ఈ డాక్యుమెంట్లను ఫోన్లో సేవ్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు డిజిటల్ పత్రాలు కూడా ఆమోదిస్తున్నారు. వీటిని మీ దగ్గర పెట్టుకుంటే ఎలాంటి ఫైన్లు ఉండవు .సురక్షితంగా ప్రయాణం చేయవచ్చు.

Also Read:

కలబంద వాడుతున్నారా.. ఈ తప్పులు చేయకండి..

ఆరోగ్య బీమా.. ప్రయోజనాలు కోల్పోకుండా వేరే కంపెనీకి ఎలా మారాలి..

For More Lifestyle News

Updated Date - Jun 21 , 2025 | 07:10 PM