Body Odour: శరీర దుర్వాసనతో బాధపడుతున్నారా.. ఈ టిప్స్ పాటిస్తే తక్షణ ఫలితం
ABN, Publish Date - Jun 22 , 2025 | 07:16 AM
శరీర దుర్వాసన నుంచి శాశ్వత విముక్తి లభించాలంటే కొన్ని టిప్స్ పాటించాలని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ కథనంలో విపులంగా తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: శరీర దుర్వాసనతో అనేక సమస్యలు. ముఖ్యంగా మనకు తెలియకుండానే నలుగురిలో పరువు పోయే అవకాశం ఉంది. అయితే, శరీర దుర్వాసన పోగొట్టుకునేందుకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కొందరిలో ఫలితం కనిపించదు. తెలియక చేస్తున్న కొన్ని పొరపాట్లే ఈ పరిస్థితికి కారణమని డెర్మటాలజిస్టులు చెబుతున్నారు. మరి రోజంతా శరీర దుర్వాసన లేకుండా ఉండాలంటే సరైన చర్మ సంబంధిత ఉత్పత్తులను వినియోగించాలి. వాటిని ఎలా వాడాలో కూడా తెలిసుండాలి. మరి ఈ విషయంలో డెర్మటాలజిస్టులు చేసే సూచనలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఫ్రాగ్రెన్స్‌ను ఎలా అప్లై చేసుకున్నామన్నది అతి ముఖ్యమైన అంశం. మీరు వాడే పర్‌ఫ్యూమ్‌కు అనుగుణంగా ఉండే సెంటెడ్ లోషన్ లేదా బాడీ క్రీమ్‌ను ముందుగా రాయాలి. మణికట్టు, మెడ, చెవి వెనకాల ఫ్రాగ్రెన్స్ రాసుకోవాలి. ఇది సెంట్ ప్రభావాన్ని పెంచుతుంది. సెంట్ ఒంటిపై రాసుకున్నాక రుద్దకూడదు. దానంతట అదే ఆరిపోవాలి.
శరీర దుర్వాసనకు అడ్డుకట్ట వేయాలంటే రోజూ స్నానం చేయాలి. దీంతో, దుర్వాసన కలిగించే బ్యాక్టీరియా పోతుంది. స్వేదం ఎక్కువగా ఉండే బాహుమూలాలు, కాళ్లు వంటి ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చర్మంపై మృత కణాలను తొలగించేందుకు స్కిన్ ఎక్స్‌ఫోలియేషన్ కూడా అవసరమే. దీంతో, చర్మం నిత్యం పరిశుభ్రంగా ఉంటుంది.
రోజంతా ఫ్రెష్‌గా ఉండాలంటే మంచి డియోడరంట్ వాడాలి. స్వేద గ్రంథులకు అడ్డంకిగా మారకుండా దుర్వాసనను తొలగించే డియోడరంట్‌ను వినియోగించాలి. స్నానం చేసి ఒంటిని ఆరబెట్టుకున్నాక పొడిగా, శుభ్రంగా ఉన్న చర్మంపై డియోడరంట్ అప్లై చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
దుర్వాసనను నిరోధించడంలో దుస్తుల పాత్ర కూడా ఉంటుంది. దుస్తులను మంచి సువాసనలు ఉన్న డిటర్జెంట్‌లను వినియోగించి ఉతకాలి. ఫ్యాబ్రిక్ సాఫ్ట్‌నర్స్‌ను కూడా దుస్తులు ఉతికేటప్పుడు వాడొచ్చు. దుస్తులు ర్యాక్‌లో పెట్టేటప్పుడు సువాసనలు వెదజల్లే శాషెలు పెట్టి ఉంచితే దుర్వాసన సమస్య చాలా వరకూ తగ్గించుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
ఇంట్లో మట్టి కుండలు ఉన్నాయా.. ఈ విషయాలు తెలుసుకోవడం తప్పనిసరి
వానాకాలంలో ఇంట్లోకి పాములు రాకుండా ఉండాలంటే..
మరిన్ని లైఫ్ స్టైల్ కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 22 , 2025 | 07:24 AM