ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Chanakya Niti: ఇలాంటి అబ్బాయిలు సులభంగా మోసపోతారు..

ABN, Publish Date - Jun 10 , 2025 | 01:38 PM

చాణక్యుడి ప్రకారం, కొన్ని రకాల స్వభావం ఉన్న అబ్బాయిలు సులభంగా మోసపోతారు. అయితే, ఎలాంటి స్వభావం ఉన్నవారు సులభంగా మోసపోతారో ఇప్పుడు తెలుసుకుందాం..

Chanakya Niti

Chanakya Niti: ప్రేమలో మోసపోవడం అనేది ఎవరికైనా చాలా బాధ కలిగించే విషయం. అయితే చాలా మంది పురుషులు కొంతవరకే బాధపడతారు, మరికొంతమంది మాత్రం పూర్తిగా దెబ్బతింటారు. చాణక్యుడు చెప్పిన మాటల ప్రకారం, కొన్ని రకాల స్వభావం ఉన్న అబ్బాయిలు సులభంగా మోసపోతారు. వారిలో మీరు కూడా ఉన్నారా? అయితే మిమ్మల్ని మీరు మార్చుకోండి.

ఎక్కువగా భావోద్వేగంగా ఉండేవాళ్లు

చాలా సెంటిమెంటల్‌గా ఉండే అబ్బాయిలు చిన్న చిన్న విషయాలకు బాధపడతారు. అలాంటి వాళ్లతో ఉన్నప్పుడు అమ్మాయిలకు ఒత్తిడి పెరుగుతుంది. అదే కారణంగా వారు ఆ సంబంధం నుంచి దూరమవుతారు.

ఆత్మవిశ్వాసం లేనివాళ్లు

తమను తామే నమ్మలేని వాళ్లు, ఏ పని చేసినా నేను చేయగలనా? అనే సందేహంలో ఉండేవాళ్లు కూడా సులభంగా మోసపోతారు. తమ అభద్రతా భావాల వల్లనే అమ్మాయిలు వారిపై ఆసక్తి కోల్పోతారు.

అతిగా అంకితభావం చూపేవాళ్లు

ప్రేమ పేరుతో తమ ఇష్టాలు, అభిరుచులు అన్నీ త్యాగం చేసి, పూర్తిగా ఎదుటి వ్యక్తికే జీవితం అంకితం చేయడం ప్రేమ కాదు. ఇది వాళ్ల వ్యక్తిత్వాన్ని కోల్పోవడమే. అలాంటి వ్యక్తులను చాలా సార్లు అసలు పట్టించుకోరు కూడా.

గొప్పలు చెప్పుకునేవాళ్లు

తమ గురించి తామే పొగిడేసుకునే, లేదా వాస్తవానికి మించి ఆడంబరంగా ప్రవర్తించే అబ్బాయిలను అమ్మాయిలు ఇష్టపడరు. ఇలాంటి వారిపై అమ్మాయిలకు నమ్మకం ఉండదు.

అనుమానం ఉన్న వాళ్లు

నమ్మకం లేకుండా ఏ బంధం నిలబడదని చాణక్యుడు అంటున్నారు. ఒకవేళ అబ్బాయి ఎప్పుడూ అనుమానం పెడుతూ, చెక్ చేస్తూ ఉంటే ఆ సంబంధం కాపాడుకోవడం చాలా కష్టమే. ఇలాంటి వారితో అమ్మాయి సంతోషంగా ఉండలేదు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)

Also Read:

ఈ సంఖ్య ఉన్నవాళ్లు చిన్ని విషయానికే కోపం పడతారు..

పాలను ఇలా మరిగిస్తే.. ఆరోగ్యానికి ముప్పు తప్పదు..

For More Lifestyle News

Updated Date - Jun 10 , 2025 | 01:38 PM