ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Chanakya Niti: ఉదయం నిద్రలేచిన తర్వాత ఇలా ఉంటే.. జీవితంలో ఎప్పటికీ విజయం సాధించలేరు..

ABN, Publish Date - Jun 20 , 2025 | 12:55 PM

జీవితంలో విజయం సాధించాలని ప్రతి వ్యక్తి కోరుకుంటాడు. అయితే, మనం చేసే కొన్ని తప్పులు విజయాన్ని దూరం చేస్తాయని చాణక్యుడు చెబుతున్నారు. ఉదయం చేయకూడని ఆ తప్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Chanakya Niti

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు జీవితానికి సంబంధించిన అనేక విషయాలను తన చాణక్య నీతిలో వివరించారు. జీవితంలో విజయం సాధించాలంటే ఏం చేయకూడదు? ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే ముఖ్య విషయాలను తన నీతిలో ప్రస్తావించారు. అయితే, జీవితంలో విజయం సాధించాలంటే ఉదయాన్నే ఈ తప్పులు చేయకూడదని చాణక్యుడు చెబుతున్నారు. ఎందుకంటే ఈ పనులు సక్సెస్‌ను దూరం చేస్తాయని అంటున్నారు. కాబట్టి, ఉదయాన్నే చేయకూడని ఆ తప్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

సోమరితనం

ఉదయం నిద్ర లేచిన వెంటనే సోమరితనంగా ఉండటం మంచిది కాదని చాణక్యుడు చెబుతున్నారు. ప్రతి రోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. అలా కాకుండా బద్ధకంగా ఉంటూ ఏ పనులు చేయకుండా ఉంటే జీవితంలో ఎప్పటికీ విజయం సాధించలేరని చాణక్యుడు అంటున్నారు.

ప్రతికూల ఆలోచనలు

మీరు ఉదయం నిద్రలేవగానే ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలని ఆచార్య చాణక్యుడు చెబుతున్నారు. అలా కాకుండా మీరు ప్రతికూల ఆలోచలు చేస్తే రోజంతా ఒత్తిడి ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. అంతేకాకుండా మీ పనుల్లో సరైన నిర్ణయాలు కూడా తీసుకోలేరని చాణక్యుడు అంటున్నారు.

ప్రణాళిక లేకుండా రోజును ప్రారంభించడం

ఆచార్య చాణక్యుడి ప్రకారం, ప్రణాళిక లేకుండా మీ రోజును ఎప్పుడూ ప్రారంభించకూడదు. మీరు ఉదయం నిద్రలేవగానే, ముందుగా మీరు ఏం పనులు చేయాలో, ఎలా చేయాలో ప్లాన్ చేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

నిద్ర లేవగానే కబుర్లు చెప్పడం

ఆచార్య చాణక్యుడి ప్రకారం, మీరు ఉదయం నిద్రలేవగానే ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం లేదా వారి గురించి గాసిప్ చేయడం మంచిది కాదు. ఇతరుల గురించి చెడుగా మాట్లాడితే మీలోని నెగటివ్ ఎనర్జీ మీ పనుల్లో విజయాన్ని దూరం చేస్తుందని అంటున్నారు.

Also Read:

కలబంద వాడుతున్నారా.. ఈ తప్పులు చేయకండి..

ఆరోగ్య బీమా.. ప్రయోజనాలు కోల్పోకుండా వేరే కంపెనీకి ఎలా మారాలి..

For More Lifestyle News

Updated Date - Jun 20 , 2025 | 03:10 PM