ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Car AC: కారులో ఏసీ బాగా పనిచేయాలంటే ఈ టిప్స్ తప్పనిసరి

ABN, Publish Date - Jun 17 , 2025 | 10:33 PM

కారులోని ఏసీ ఎక్కువ కాలం పాటు సమర్థవంతంగా పని చేయాలంటే కొన్ని టిప్స్ ఫాలో కావాలి. వీటిని తూచా తప్పకుండా ఫాలో అయితే ఇంధనాన్ని కూడా ఆదా చేసుకోవచ్చు. మరి ఇవేంటో కూలంకషంగా తెలుసుకుందాం.

Car AC Efficiency Tips

ఇంటర్నెట్ డెస్క్: మధ్యాహ్నం వేళ ఏ కాలంలో కారు ప్రయాణమైనా ఏసీ వేసుకోవడం తప్పనిసరి. కానీ కొన్ని సార్లు ఏసీ కూలింగ్ తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. కారు యజమానులు తెలీకుండా చేసే కొన్ని పొరపాట్లే ఈ పరిస్థితికి కారణమని నిపుణులు చెబుతున్నారు. ఈ తప్పులు చేయకుండా ఉంటే ఇంధనం ఆదా అవడంతో పాటు ఏసీ జీవితకాలం కూడా పెరుగుతుంది. కారు మెయింటెనెన్స్ ఖర్చులు కూడా తగ్గుతాయి. మరి ఈ టిప్స్ ఏంటో ఈ కథనంలో కూలంకషంగా తెలుసుకుందాం.

కారును ఎప్పుడూ నీడలోనే నిలిపి ఉంచాలి. నేరుగా ఎండ తగిలే చోట కారు పార్క్ చేస్తే లోపలి ఉష్ణోగ్రత కూడా విపరీతంగా పెరుగుతుంది. దీంతో, ఏసీపై ఒత్తిడి పెరుగుతుంది. చల్లదనం మాత్రం ఆశించిన స్థాయిలో ఉండదు.

ఏసీ ఆన్ చేసే ముందు కారులోని వేడి గాలి బయటకు పోయేలా చేయాలి. ఇందుకోసం కొన్ని నిమిషాల పాటు కారు విండోస్‌ను తెరిచి ఉంచాలి. దీంతో, కారులో ఉన్న వేడి మొత్తం బయటకు పోతుంది. ఏసీపై ఆటోమేటిక్‌గా చాలా వరకూ లోడ్ తగ్గుతుంది.

కారులోపలి వాతావరణం చల్లబడిన వెంటనే ఏసీని రీసర్క్యులేషన్ మోడ్‌లో పెట్టాలి. దీంతో, కారులోపలి గాలి మళ్లీ క్యాబిన్ అంతా ప్రసరిస్తుంది. బయట గాలిని ప్రత్యేకంగా చల్లబరచాల్సిన అవసరం తగ్గి ఏసీపై భారం తగ్గుతుంది.

ఏసీ ఫ్యాన్‌ను అత్యధిక స్పీడుతో రన్ చేయడం కూడా తప్పే. ఒకసారి కారు లోపలి క్యాబిన్ అంతా చల్లబడ్డాక ఏసీ ఫ్యాన్‌ను తక్కువ స్పీడుతో రన్ చేయాలి. దీంతో, ఏసీపై ఒత్తిడి తగ్గి ఇంధనం ఆదా అవుతుంది. ఏసీ జీవితకాలం పెరుగుతుంది.

కారు ఏసీ పది కాలాల పాటు ఎలాంటి మొరాయింపులు లేకుండా పనిచేయాలంటే క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించాలి. దీంతో, రెఫ్రిజ్‌రెంట్ తగిన మోతాదులో ఉంటుంది. లీక్స్ వంటివి తలెత్తవు.

ఏసీ ఎయిర్ ఫిల్టర్‌ను కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం అవసరం. ఏసీ మ్యాన్యువల్‌ను అనుసరించి ఫిల్టర్లను మారుస్తూ ఉండాలి. ఫిల్టర్‌కు అడ్డంకులు ఏర్పడితే గాలి ప్రవాహం తగ్గుతుంది. ఫలితంగా ఏసీ మరింత ఎక్కువగా పని చేయాల్సి ఉంటుంది.

ఆరుబయట కారు పార్క్ చేయాల్సి వచ్చినప్పుడు విండ్ షీల్డ్‌పై రిఫ్లెక్టివ్ సన్ షేడ్ అమర్చుకుంటే బయటి వాతావరణ ప్రభావం క్యాబిన్ లోపల అంతగా ఉండదు.

ఇక గమ్యస్థానానికి చేరుకోవడానికి కొన్ని నిమిషాల ముందే ఏసీని ఆఫ్ చేయాలి. దీంతో, వ్యవస్థ పూర్తిగా ఆరిపోతుంది. వెంట్స్‌పై ఫంగస్ పెరగదు. ఇలా చేయని పక్షంలో ఏసీ వెంట్స్‌పై మలినాలు పేరుకుని కారులో దుర్గంధం వ్యాపించే అవకాశం పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి:

వానాకాలంలో ఇంట్లోకి పాములు రాకుండా ఉండాలంటే..

ఇంట్లో మట్టి కుండలు ఉన్నాయా.. ఈ విషయాలు తెలుసుకోవడం తప్పనిసరి

మరిన్ని లైఫ్ స్టైల్ కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 17 , 2025 | 11:29 PM