Bike Key Metal Tag: బైక్ కీతో పాటు ఈ మెటల్ టాగ్ ఎందుకు ఇస్తారో తెలుసా?
ABN, Publish Date - Jul 13 , 2025 | 12:31 PM
బైక్, స్కూటర్ లేదా మరే ఇతర వాహనానికి అయినా సరే రెండు 'కీ' లు ఇస్తారు. అంతేకాకుండా ఆ కీ లతో పాటుగా ఒక మెటల్ టాగ్ కూడా ఇస్తారు. అయితే, ఈ మెటల్ టాగ్ ఎందుకు ఇస్తారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి ఓ కారణం ఉంటుందని మీరు ఎప్పుడూ ఊహించి ఉండరు. ఆ కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: బైక్, స్కూటర్ లేదా మరే ఇతర వాహనానికి అయినా సరే రెండు 'కీ' లు ఇస్తారు. అంతేకాకుండా ఆ కీ తో పాటుగా ఒక మెటల్ ట్యాగ్ కూడా ఇస్తారు. అయితే, చాలా మంది ఈ మెటల్ టాగ్ ఎందుకు పనికిరాదులే అని పారేస్తుంటారు. కానీ, మీకు తెలియని విషయం ఏంటంటే ఈ మెటల్ ట్యాగ్ వల్ల కూడా ఉపయోగం ఉంటుంది. అయితే, దీని వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుంది? దీనిని ఎందుకు ఇస్తారో ఇప్పుడు తెలుసుకుందాం..
చాలా మంది బైక్ కీ పొగొట్టుకుంటుంటారు. ఇచ్చిన రెండు కీస్ పోతే ఇక డూప్లికేట్ కీని చేపించుకుంటారు. ఇలా బై ఎనీ ఛాన్స్ మీకు షోరూం వాళ్లు ఇచ్చిన రెండు ఒరిజినల్ బైక్ కీస్ పోతే.. మీ బండిని షోరూమ్ దాకా తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ మెటల్ పీస్ సహాయపడుతుంది.
ఈ మెటల్ పీస్‌ను షోరూమ్‌లోకి ఇస్తే చాలు. మీకు ఒరిజినల్ కీ చేసి ఇస్తారు. అదెలా అంటే.. ఆ మెటల్ పీస్ మీద ఒక యూనిక్ కోడ్ ఉంటుంది. ఆ యూనిక్ కోడ్ సహాయంతో మీ బండి అవసరం లేకుండా, మీ బండి లాక్ సెట్‌తో పని లేకుండా, ఒక ఒరిజినల్ కీని తాయారు చేసి ఇస్తారు. సో ఎందుకైనా మంచిది ఆ మెటల్ ట్యాగ్‌ను మీ దగ్గరే జాగ్రత్తగా పెట్టుకోండి. ఒకవేళ దానిని పడేద్దామని అనుకుంటే కనీసం ఆ కోడ్ ను ఫొటో తీసి పెట్టుకోవడం మంచిది.
Also Read:
అసలు సిసలైన ట్రాఫిక్ పోలీస్.. లైన్ క్రాస్ చేయకుండా ఏం చేశాడో చూస్తే..
ఆ హోటల్‌లో బస చేస్తే.. టిఫిన్ ఫ్రాన్స్‌లో, కాఫీ స్విట్జర్లాండ్‌లో...
For More Viral News
Updated Date - Jul 13 , 2025 | 12:39 PM