US President Donald Trump: జీ20 సదస్సును బహిష్కరించిన అమెరికా
ABN, Publish Date - Nov 09 , 2025 | 01:26 AM
దక్షిణాఫ్రికాలో ఈ నెల 22, 23 తేదీల్లో నిర్వహించనున్న జీ20 సదస్సును బహిష్కరిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అమెరికా తరఫున ఒక్క...
ఒక్క అధికారి కూడా వెళ్లరు: ట్రంప్
దక్షిణాఫ్రికాలో ఎలా నిర్వహిస్తారని ప్రశ్న
వాషింగ్టన్, నవంబరు 8: దక్షిణాఫ్రికాలో ఈ నెల 22, 23 తేదీల్లో నిర్వహించనున్న జీ20 సదస్సును బహిష్కరిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అమెరికా తరఫున ఒక్క అధికారి కూడా హాజరు కాబోరని తెలిపారు. స్థానిక మైనార్టీలైన ఆఫ్రికానర్స్‌పై జరుగుతున్న వేధింపులకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఫ్రాన్స్, జర్మనీ, డచ్ ఇతర దేశాల నుంచి వలస వచ్చి దక్షిణాఫ్రికాలో స్థిరపడ్డవారిని ఆఫ్రికానర్స్‌గా వ్యవహరిస్తుంటారు. కాగా, అసలు దక్షిణాఫ్రికాకు జీ20 కూటమిలో సభ్యత్వం ఎలా ఇచ్చారని, ఆ దేశంలో ఎందుకు సదస్సు నిర్వహిస్తున్నారని ట్రంప్ ప్రశ్నించారు. ఇదిలా ఉండగా, ఒహాయో రాష్ట్రం గవర్నర్ పదవికి వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా భారత మూలాలు ఉన్న వివేక్ రామస్వామి(38)కి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. ఆయన చాలా ప్రత్యేకమైన వ్యక్తి అని, విజయం సాధిస్తే గొప్ప రాష్ట్రానికి గొప్ప గవర్నర్ అవుతారంటూ ట్రూత్ సోషల్‌లో పోస్టు పెట్టారు. వివేక్ రామస్వామి ‘యంగ్, స్ట్రాంగ్, స్మార్ట్’ దేశభక్తుడని అభివర్ణించారు.
Updated Date - Nov 09 , 2025 | 01:26 AM