Donald Trump: గ్రీన్‌కార్డు లాటరీ సస్పెండ్
ABN, Publish Date - Dec 20 , 2025 | 04:29 AM
అమెరికాకు ఇతర దేశాల పౌరుల వలసలను నిరోధించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్న ఆ దేశాధ్యక్షుడు ట్రంప్.. మరో కీల నిర్ణయం తీసుకున్నారు...
నేచురలైజ్డ్ అమెరికన్ల పౌరసత్వాల తొలగింపునకు అధికారులకు టార్గెట్లు
వలసలపై ట్రంప్ మరో కఠిన నిర్ణయం
వాషింగ్టన్, డిసెంబరు 19: అమెరికాకు ఇతర దేశాల పౌరుల వలసలను నిరోధించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్న ఆ దేశాధ్యక్షుడు ట్రంప్.. మరో కీల నిర్ణయం తీసుకున్నారు. గ్రీన్‌కార్డు లాటరీ విధానాన్ని సస్పెండ్ చేశారు. అఽధ్యక్షుడి ఆదేశంతో గ్రీన్‌కార్డు లాటరీ ప్రోగ్రామ్‌ను నిలిపేయాలని అమెరికా సిటిజన్‌షి్‌ప అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎ్‌ససీఐఎ్‌స)కు ఆదేశాలిచ్చినట్లు హోంలాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిష్టీ నోయెమ్ గురువారం ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఇటీవల బ్రౌన్ యూనివర్సిటీతోపాటు ప్రఖ్యాత మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ)లో కాల్పులు చోటుచేసుకున్నాయి. బ్రౌన్ వ ర్సిటీ కాల్పుల్లో ఇద్దరు విద్యార్థులు మరణించగా, 9 మంది గాయపడ్డారు. ఎంఐటీలో ఓ ప్రొఫెసర్ చనిపోయారు. ఈ కాల్పులకు పాల్పడింది పోర్చుగల్‌కు చెందిన నెవిస్ వాలెంటీ (48) అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ తర్వాత అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతడు గ్రీన్‌కార్డు లాటరీ ప్రోగ్రామ్ ద్వారానే గ్రీన్‌కార్డు సంపాదించి అమెరికాలో శాశ్వతంగా నివాసం ఉంటున్నట్లు గుర్తించారు. ఈ ఘటన నేపథ్యంలోనే ట్రంప్ ఈ ప్రోగ్రామ్‌ను సస్పెండ్ చేసినట్లు భావిస్తున్నారు.
ఏమిటీ గ్రీన్‌కార్డు లాటరీ ప్రోగ్రామ్?
అమెరికాలో శాశ్వతంగా నివాసం ఉండేందుకువిదేశీయులకు ఇచ్చేదే ఈ గ్రీన్‌కార్డు. అయితే, కొన్ని దేశాల పౌరుల వద్దనే ఈ కార్డులు ఽఅధికంగా ఉన్నాయని గుర్తించిన అమెరికా ప్రభుత్వం.. ఆ దేశంలో తక్కువ పౌర ప్రాతినిథ్యం ఉన్న దేశాలకు ఈ కార్డులు అధికంగా జారీచేసేందుకు ఈ లాటరీ ప్రోగ్రామ్‌ను తీసుకొచ్చింది. ‘డైవర్సిటీ వీసా ప్రోగ్రామ్’లో భాగంగా ఏటా 50 వేల గ్రీన్‌కార్డులను లాటరీ ద్వారా జారీచేస్తుంటారు. వీటిని పొందేవారిలో అధికంగా ఆఫ్రికా దేశాలవాళ్లు ఉంటారు. లాటరీలో పేరు వచ్చినవాళ్లు నిర్ణీత సమయంలోపు గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ లాటరీ విధానాన్ని ట్రంప్ మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నారు. లాటరీ వల్ల అమెరికాకు ఉపయోగపడే నిపుణులకు కాకుండా.. విద్రోహ చర్యలకు పాల్పడేవారికి కార్డులు దక్కుతున్నాయని వాదిస్తున్నారు.
పౌరసత్వాల తొలగింపునకు టార్గెట్
విదేశీ పౌరులు అమెరికాలోకి అడుగు పెట్టకుండా కఠిన ఆంక్షలు విధిస్తున్న ట్రంప్.. అమెరికా పౌరుల పౌరసత్వాలను కూడా తొలగించే చర్యలు ప్రారంభించారు. ‘నేచురలైజ్డ్ అమెరికన్స్’కు సంబంధించిన పౌరసత్వ దరఖాస్తులను పునఃపరిశీలించి, నెలకు 100 నుంచి 200 వరకు పౌరసత్వాలను రద్దు చేయాలని ట్రంప్ ప్రభుత్వం ఇమిగ్రేషన్ లిటిగేషన్ కార్యాలయాలకు మంగళవారం ఆదేశాలు జారీచేసినట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించింది. నేచురలైజ్డ్ అమెరికన్స్ అంటే.. విదేశాల్లో పుట్టి చట్టబద్ధంగా అమెరికా పౌరసత్వం పొందినవారు. ఈ రకం పౌరులు ప్రస్తుతం అమెరికాలో 2.6 కోట్ల మంది ఉన్నారు. 2024 సంవత్సరంలోనే 8 లక్షల మంది అమెరికా పౌరులుగా ప్రమాణం చేశారు. వీరిలో కూడా మెక్సికో, భారత్, ఫిలిప్పైన్స్, డొమినిక్ రిపబ్లిక్, వియత్నాంలలో పుట్టినవారే అధికం.
హెచ్1బీ కోసం లంచాలిస్తున్న భారతీయులు: మహవాష్ సిద్ధికీ
హెచ్1బీ వీసాలు దక్కించుకొనేందుకు భారతీయులు లంచాలు ఇస్తున్నారని భారత సంతతి అమెరికా దౌత్య అధికారి మహవాష్ సిద్ధికీ ఆరోపించారు. చెన్నైలోని అమెరికా కాన్సులేట్‌లో జూనియర్ అధికారిణిగా పనిచేస్తున్నప్పుడు తనకు ఈ అనుభవం ఎదురైందని చెప్పారు. హెచ్1బీ వీసాల దుర్వినియోగాన్ని అడ్డుకొనేందుకు మొత్తం ఆ వీసాల జారీనే నిలిపేసి నిబంధనలను పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని వలసల వ్యతిరేక మేధో సంస్థ సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీ్‌సకు రాసిన లేఖలో సూచించారు. ఇదిలా ఉండగా, 2026 సంవత్సరానికి సంబంధించిన నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్ బిల్లుపై అధ్యక్షుడు ట్రంప్ గురువారం సంతకం చేశారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు భారత్‌తో నిరంతరం సంప్రదింపులు జరిపే వ్యవస్థను ఏర్పాటుచేసి, నిర్వహించాలని అమెరికా విదేశాంగ మంత్రికి సూచించే నిబంధన ఈ చట్టంలో పొందుపర్చారు.
Updated Date - Dec 20 , 2025 | 04:29 AM