ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

US Rescinds Decision: విద్యార్థుల బహిష్కరణపై వెనక్కి!

ABN, Publish Date - Apr 27 , 2025 | 02:03 AM

అమెరికాలో విదేశీ విద్యార్థుల SEVIS రికార్డులు రద్దు చేసిన నిర్ణయాన్ని ట్రంప్‌ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. కోర్టుల ఆదేశాల తరువాత SEVIS రికార్డులు పునరుద్ధరించడం ప్రారంభమైంది.

అమెరికాలోని విదేశీ విద్యార్థుల సెవిస్‌ రికార్డుల పునరుద్ధరణ ప్రారంభం

వందలాది మందికి తాత్కాలిక ఊరట

కొత్త పాలసీ తీసుకురానున్న ఐసీఈ

ముంబై, ఏప్రిల్‌ 26: అమెరికాలోని భారత్‌తో పాటు విదేశీ విద్యార్థులకు కొంత ఉపశమనం కలిగించే వార్త. ట్రంప్‌ ప్రభుత్వం అకస్మాత్తుగా, చట్టవిరుద్ధంగా చేపట్టిన వందలాది మంది విదేశీ విద్యార్థుల సెవిస్‌(స్టూడెంట్‌ అండ్‌ ఎక్స్‌చేంజ్‌ విజిటర్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌) రికార్డుల రద్దు నిర్ణయంపై వెనక్కు తగ్గింది. దేశవ్యాప్తంగా సెవిస్‌ రికార్డుల పునరుద్ధరణ గురువారం సాయంత్రం నుంచి ప్రారంభమైంది. కోర్టుల ఆదేశాల నేపథ్యంలో ట్రంప్‌ ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకుంది. రికార్డుల రద్దును సవాల్‌ చేస్తూ దావా వేసిన విద్యార్థులతో పాటు అమెరికావ్యాప్తంగా ఉన్న ఇతర విదేశీ విద్యార్థుల సెవిస్‌ రికార్డుల పునరుద్ధరణ జరుగుతోందని ఇమిగ్రేషన్‌ న్యాయవాదులు వెల్లడించారు. ఏప్రిల్‌ 4 తర్వాత యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాలో 23 మంది విద్యార్థుల సెవిస్‌ రికార్డులు రద్దు కాగా, వారిలో శనివారం 12 మంది స్టేటస్‌ తిరిగి యాక్టివ్‌ అయిందని ‘కాలిఫోర్నియన్‌’ పత్రిక పేర్కొంది.


కోర్టుల తాత్కాలిక నిషేధ ఉత్తర్వులు

సెవిస్‌ ఒక వెబ్‌ ఆధారిత సమాచార వ్యవస్థ. విదేశీ విద్యార్థులు అమెరికాలో విద్యనభ్యసిస్తున్న సమయంలో వారిని ట్రాక్‌ చేసేందుకు, పర్యవేక్షించేందుకు అమెరికా ఏజెన్సీలు దీన్ని ఉపయోగిస్తాయి. అయితే అకస్మాత్తు సెవిస్‌ రద్దు ప్రక్రియ ఈ ఏడాది మార్చి మధ్యలో ప్రారంభమైంది. స్వీయ బహిష్కరణ ప్రమాదం ఎదుర్కొన్న చాలా మంది విద్యార్థులు.. ట్రంప్‌ ప్రభుత్వ ఆదేశాలకు వ్యతిరేకంగా పలు జిల్లా కోర్టుల్లో దావాలు వేశారు. జార్జియా, న్యూ హ్యాంప్‌షైర్‌, మిన్నెసోట, వాషింగ్టన్‌, విస్కాన్సిన్‌ వంటి కోర్టులు ప్రభుత్వ చర్యలపై తాత్కాలిక నిషేఽధ ఉత్వర్వులు ఇచ్చాయి. 1,500 మందికి పైగా విదేశీ విద్యార్థుల వీసాల రద్దుపై ట్రంప్‌ ప్రభుత్వం వెనక్కి తగ్గిందని న్యూయార్క్‌ టైమ్స్‌ నివేదించింది.

త్వరలోనే కొత్త పాలసీ

సెవిస్‌ రికార్డుల రద్దుపై ట్రంప్‌ సర్కార్‌ త్వరలోనే కొత్త పాలసీ తీసుకురానున్నట్లు తెలుస్తోంది. సెవిస్‌ రికార్డుల టెర్మినేషన్‌ ఫ్రేమ్‌వర్క్‌కు సంబంధించి ఇమిగ్రేషన్‌ కస్టమ్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ఐసీఈ) ఒక పాలసీ రూపొందించే పనిలో ఉంది. ‘ఆ పాలసీ అమల్లోకి వచ్చే వరకు సెవిస్‌ రికార్డులు యాక్టివ్‌లోనే ఉంటాయి. వాటిని పునరుద్ధరిసున్నాం. కేవలం జాతీయ నేర సమాచార కేంద్రం (ఎన్‌సీఐసీ) ఆధారంగా ఐసీఈ సెవిస్‌ రికార్డులను మార్చదు..’ అనే సమాచారం పలు విద్యాసంస్థలకు అందిందని ఇమిగ్రేషన్‌ న్యాయవాదులు తెలిపారు. అమెరికాలో నేర సంబంధించి సమాచారం ఎన్‌సీఐసీ వద్ద ఉంటుంది. దీన్ని ఎఫ్‌బీఐకి చెందిన క్రిమినల్‌ జస్టిస్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీసెస్‌ డివిజన్‌ (సీజేఐఎస్‌) నిర్వహిస్తుంది. ఇది దేశవ్యాప్తంగా ఉన్న అన్ని చట్ట అమలు సంస్థలకు ప్రాప్యతను అందించడంతో పాటు వేగంగా సమాచార మార్పిడికి వీలు కల్పిస్తుంది.


ఇమిగ్రేషన్‌ ఆపరేషన్‌ అడ్డుకున్నందుకు జడ్జి అరెస్టు

ఇమిగ్రేషన్‌ అరెస్టు ఆపరేషన్‌ను అడ్డుకున్నందుకు, అరెస్టు నుంచి ఒక వ్యక్తి తప్పించుకొనేందుకు సహకరించారన్న ఆరోపణలపై అమెరికాలోని విస్కాన్సిన్‌ రాష్ట్రం మిల్వాకీ కౌంటీ సర్క్యూట్‌ జడ్జి హన్నా దుగాన్‌ను ఎఫ్‌బీఐ శుక్రవారం అదుపులోకి తీసుకుంది. జడ్జిపై ఒక క్రిమినల్‌ ఫిర్యాదు దాఖలైంది. జడ్జి అరెస్టుపై ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ కాశ్‌ పటేల్‌ స్పందించారు. దుగాన్‌ అరెస్టుకు సంబంధించిన ఫొటోను తన ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేస్తూ ‘చట్టం కంటే ఎవరూ ఎక్కువ కాదు’ అని పేర్కొన్నారు. కాగా, ఫెడరల్‌ అధికారులు ఇటీవల సాక్ష్యాధారాల తారుమారు, వెనిజులన్‌ స్ట్రీట్‌ గ్యాంగ్‌తో సంబంధాలు ఉన్నాయన్న అభియోగాలపై న్యూ మెక్సికో మాజీ జడ్జి జోయెల్‌ కానోను అరెస్టు చేశారు.


ఇవి కూడా చదవండి:

పెళ్లై సంవత్సరం కూడా కాలేదు.. అంతలోనే విషాదం..

Seema Haider: పాకిస్తాన్ తిరిగి వెళ్లటంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీమా హైదర్

Updated Date - Apr 27 , 2025 | 02:03 AM