ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Pakistan threat: భారత్‌ను అతిపెద్ద ముప్పుగా చూస్తున్న పాక్‌

ABN, Publish Date - May 26 , 2025 | 02:09 AM

అమెరికా రక్షణ సంస్థ వార్షిక నివేదిక ప్రకారం, పాకిస్థాన్ భారత్‌ను ప్రధాన ముప్పుగా చూస్తూ అణ్వాయుధాలను ఆధునీకరించుకోవడానికి చైనా, టర్కీ, సింగపూర్, యూఏఈ సహాయం తీసుకుంటోంది. దీనిపై ప్రతిచర్యగా భారత్‌ దేశీయ రక్షణ ఉత్పత్తుల తయారీలో దృష్టి సారించి, ఇతర దేశాలపై ఆధారాన్ని తగ్గిస్తోంది.

అమెరికా రక్షణ నిఘా సంస్థ వార్షిక నివేదిక వెల్లడి

వాషింగ్టన్‌, మే 25: పాకిస్థాన్‌.. భారత్‌ను అతిపెద్ద ముప్పుగా పరిగణిస్తోందని, తన అణ్వాయుధాలను ఆధునీకరించుకోవడంతో పాటు భారీ విధ్వంసక ఆయుధాలను సమీకరించుకుంటోందని అమెరికా రక్షణ నిఘా సంస్థ వార్షిక నివేదిక బయటపెట్టింది. ఇందుకు చైనా, టర్కీ, సింగపూర్‌, యూఏఈ దేశాల సహకారం తీసుకుంటున్నట్లు వెల్లడించింది. అణు పదార్థాల భద్రత, న్యూక్లియర్‌ కమాండ్‌ కంట్రోల్‌తో పాటు భారీ విధ్వంసక ఆయుధాల అభివృద్ధికి అవసరమైన వస్తువులు, టెక్నాలజీని విదేశీ సరఫరాదారులు, మధ్యవర్తుల సహాయంతో పాక్‌ సేకరిస్తోందని నివేదిక తెలిపింది. పాకిస్థాన్‌ తనకు కావాల్సిన ఆయుధాలను చైనా నుంచే కొనుగోలు చేస్తోందని, అయితే ఇటీవల కాలంలో చైనా కార్మికులపై ఉగ్రవాదుల దాడులు పెరగడంతో రెండు దేశాల మధ్య కొంతమేరకు సంఘర్షణ ఏర్పడిందని నివేదిక వెల్లడించింది. అయితే, చైనాను భారత్‌ ప్రధాన విరోధిగా చూస్తోందని, ఈ తరుణంలో చైనాకు చెక్‌ పెట్టేందుకు హిందూ మహాసముద్రం ప్రాంతంలోని ఇతర దేశాలతో రక్షణ సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై భారత్‌ ప్రధానంగా దృష్టి సారించిందని ఈ నివేదిక తెలిపింది. రక్షణ రంగాన్ని పటిష్టం చేసుకునేందుకు, ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు, సైన్యాన్ని ఆధునీకరించుకునేందుకు భారత్‌ దేశీయంగా రక్షణ ఉత్పత్తుల తయారీని పెద్ద ఎత్తున ప్రారంభించిందని నివేదిక వెల్లడించింది.


ఇవి కూడా చదవండి

Minister Satyakumar: 2047 నాటికి ప్ర‌పంచంలో రెండో స్థానానికి భార‌త్ ఎద‌గ‌డం ఖాయం

Transgenders: డబ్బులు అడగొద్దన్నందుకు.. నడిరోడ్డులో పోలీస్‌పై ట్రాన్స్‌జెండర్ల దారుణం..

Indian Delgation in Japan: ఉగ్రవాదం రాబిడ్ డాగ్‌, దాని నీచమైన నిర్వాహకుడు పాక్‌.. నిప్పులు చెరిగిన అభిషేక్

India slams Pak: ప్రసంగాలు ఆపండి.. UN లో పాక్‌పై విరుచుకుపడిన భారత్..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 26 , 2025 | 02:09 AM