ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

US Reduces Work Permit: వలసదారుల వర్క్‌ పర్మిట్ల కాలవ్యవధి కుదింపు

ABN, Publish Date - Dec 06 , 2025 | 04:04 AM

శరణార్థులు, వలసదారులకు ట్రంప్‌ యంత్రాంగం మరో షాక్‌ ఇచ్చింది. వీరికి ఇచ్చే వర్క్‌ పర్మిట్ల కాల వ్యవధిని ఐదేళ్ల నుంచి 18 నెలలకు తగ్గించింది...

  • ఐదేళ్ల నుంచి 18 నెలలకు తగ్గింపు: యూఎ్‌ససీఐఎస్‌

న్యూఢిల్లీ, డిసెంబరు 5: శరణార్థులు, వలసదారులకు ట్రంప్‌ యంత్రాంగం మరో షాక్‌ ఇచ్చింది. వీరికి ఇచ్చే వర్క్‌ పర్మిట్ల కాల వ్యవధిని ఐదేళ్ల నుంచి 18 నెలలకు తగ్గించింది. భద్రతాపరమైన కారణాలతోనే ఈ మేరకు నిబంధనలు సవరించినట్లు అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం(యూఎ్‌ససీఐఎస్‌) గురువారం ప్రకటించింది. ఈ నిర్ణయంతో అమెరికాలో పనిచేయాలనుకొనేవారు ప్రజా భద్రతకు ముప్పు కలిగించకుండా, అమెరికన్‌ వ్యతిరేక భావజాలాన్ని ప్రోత్సహించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకొనే అవకాశం ఉంటుందని పేర్కొంది. సవరించిన నిబంధనల ప్రకారం.. శరణార్థులు, ఆశ్రయం కోరేవారు, గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్న వారికి ఐదేళ్లకు బదులుగా 18నెలలకు పరిమితం చేసిన ఎంప్లాయ్‌మెంట్‌ ఆథరైజేషన్‌ డాక్యుమెంట్‌(ఈఏడీ) మంజూరు చేస్తారు. అదే విధంగా టెంపరరీ ప్రొటెక్టెడ్‌ స్టేటస్‌ (టీపీఎస్‌) కలిగినవారు, పెరోల్‌ దారులు, టీపీఎస్‌ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నవారికి ఏడాది, అంతకంటే తక్కువ సమయానికి వర్క్‌ పర్మిట్‌ ఇస్తారు.

Updated Date - Dec 06 , 2025 | 04:04 AM