US Embasy in Israel: ఇరాన్ క్షిపణి దాడుల్లో దెబ్బతిన్న అమెరికా ఎంబసీ మూసివేత
ABN, Publish Date - Jun 16 , 2025 | 04:55 PM
ఇరాన్ ఆదివారంనాడు జరిపిన క్షిపణి దాడుల్లో టెల్ అవివ్ లోని అమెరికా రాయబార కార్యాలయం భవంతి దెబ్బతినడంతో తాత్కాలికంగా మూసివేశారు
టెల్ అవివ్: ఇరాన్ ఆదివారంనాడు జరిపిన క్షిపణి దాడుల్లో టెల్ అవివ్ (Tel Aviv)లోని అమెరికా రాయబార కార్యాలయం భవంతి దెబ్బతినడంతో తాత్కాలికంగా మూసివేశారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్‌లో అమెరికా రాయబారి మైక్ మకబి సోమవారంనాడు ధ్రువీకరించారు. ఈ దాడిలో యూఎస్ దౌత్య సిబ్బంది మృతి చెందడం కానీ, గాయపడటం కానీ జరగలేదు. అయితే, పేలుడు ధాటికి యూఎస్ ఎంబసీ భవంతి దెబ్బతినట్టు సోషల్ వీడియోలో పోస్ట్ చేసిన వీడియోల్లో కనిపిస్తోంది.
ఎంబసీ బ్రాంచ్ సమీపంలో ఇరాన్ క్షిపణి దాడితో స్వల్పమైన డ్యామేజ్ జరిగిందని, సిబ్బందికి అసౌకర్యం కలుగకుండా సోమవారంనాడు కార్యాలయానికి మూసివేశామని మకబి తెలిపారు. కాగా, భవంతి సమీపంలో క్షిపణి దాడితో యూఎస్ కార్యాలయ భవంతి విండో గ్లాసులు దెబ్బతిన్నాయి. ఎమర్జెన్సీ ప్రోటాకాల్‌కు అనుగుణంగా ఎంబసీ సిబ్బందిని సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని అధికారులు కోరారు.
అమెరికా ఎంబసీ కార్యాలయం సమీపంలో క్షిపణి దాడి జరగడంతో ఈ ప్రాంతంలో యూఎస్ దౌత్య కార్యలాపాలకు తొలిసారి ముప్పు తలెత్తింది. సోమవారం తెల్లవారుజామున ఇరాన్ తాజా క్షిపణి దాడులు జరపడంతో ఇజ్రాయెల్‌లో ఎయిర్ రెయిడ్ సైరెన్లు మోగాయి. నాలుగు రోజు కూడా క్షిపణి దాడులు కొనసాగుతుండటంతో ఈ దాడుల్లో ఐదుగురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. ఇజ్రాయెల్ తమ మిటలరీ, న్యూక్లియర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై దాడి చేసినందున ప్రతీకార దాడుల్లో భాగంగా 100 క్షిపణలను ప్రయోగించినట్టు ఇరాన్ ప్రకటించింది. గత శుక్రవారం నుంచి జరుగుతున్న దాడుల్లో ఇరాన్‌లో 224 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇవి కూడా చదవండి..
ఇజ్రాయెల్ దాడుల వేళ అక్కడి భారతీయులకు కీలక సూచన
36 దేశాలపై ట్రావెల్ బ్యాన్.. యోచనలో అమెరికా
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 16 , 2025 | 05:25 PM