ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ట్రంప్‌కు కోర్టులో ఎదురుదెబ్బ

ABN, Publish Date - May 30 , 2025 | 05:55 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రఖ్యా త హార్వర్డ్‌ వర్సిటీలో విదేశీ విద్యార్థులు చేరకుండా ఆయన ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఫెడరల్‌ కోర్టు అడ్డుకొంది.

  • హార్వర్డ్‌లో విదేశీ విద్యార్థులు చేరకుండా చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుకట్ట

  • తాత్కాలికంగా నిలిపివేసిన ఫెడరల్‌ కోర్టు

వాషింగ్టన్‌, మే 29: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రఖ్యా త హార్వర్డ్‌ వర్సిటీలో విదేశీ విద్యార్థులు చేరకుండా ఆయన ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఫెడరల్‌ కోర్టు అడ్డుకొంది. ప్రభుత్వ ప్రయత్నాలను నిలిపివేస్తూ ఫెడరల్‌ కోర్టు జడ్జి ఎల్లిసన్‌ బరోస్‌ బుధవారం తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే విషయమై గత వారం ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని తెలిపారు. తుది తీర్పు వెలువడే వరకు యథాతథ స్థితి కొనసాగుతుందని పేర్కొన్నారు. హార్వర్డ్‌ లాయర్ల వాదనలు విన్న అనంతరం ఆమె ‘ప్రజలు భయపడుతున్నారు’ అంటూ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ నిర్ణ యం కారణంగా వేలాది మంది విదేశీ విద్యార్థులు అనిశ్చిత స్థితిలో చిక్కుకున్నారని వర్సిటీ న్యాయవాదులు తెలిపారు.


వీరిలో 800 మంది భారతీయ విద్యార్థులు కూడా ఉన్నారు. కొంతమంది ఇతర విద్యా సంస్థల్లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తుండగా, మరికొందరు ప్రవేశాలను వాయిదా వేసుకుంటున్నారని చెప్పారు. విదేశీ విద్యార్థుల సంఖ్య 15 శాతానికి మించకూడదని షరతు విధించిన నేపథ్యంలో చైనావంటి దేశాల వారికి అధికారులు వీసాలు కూడా నిరాకరిస్తున్నారు. మరోవైపు హార్వర్డ్‌ యార్డ్‌లో జరిగిన సమావేశంలో 9,000 మంది విద్యార్థులు గ్రాడ్యుయేషన్‌ డిగ్రీలను అందుకున్నారు. ఈ సందర్భంగా హార్వర్డ్‌ ప్రెసిడెంట్‌ అలన్‌ గార్బర్‌ మాట్లాడుతూ విదేశీయులకు ద్వారాలు తెరిచే ఉంటాయని హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. కాగా, హార్వర్డ్‌పై అధ్యక్షుడు ట్రంప్‌ మరోమారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వర్సిటీని ఓ డిజాస్టర్‌గా అభివర్ణించారు. అక్కడి విద్యార్థులు సమస్యలను సృష్టించే(ట్రబుల్‌ మేకర్లు) అని వ్యాఖ్యానించారు. ఏటా 5 బిలియన్‌ డాలర్లకు పైగా నిధులు తీసుకుంటున్న హార్వర్డ్‌లో జాతి వ్యతిరేక ధోరణి పెరుగుతోందని విమర్శించారు.

Updated Date - May 30 , 2025 | 05:55 AM