Jerome Powell: ట్రంప్ పై తీవ్ర విమర్శలు చేసిన యూఎస్ సెంట్రల్ బ్యాంక్ చీఫ్
ABN, Publish Date - Apr 17 , 2025 | 08:08 PM
ట్రంప్ సుంకాలు అమెరికాకు తెచ్చిపెట్టే అతిపెద్ద పరిణామాలపై యూఎస్ సెంట్రల్ బ్యాంక్ చీఫ్ జెరోమ్ పావెల్ తీవ్ర ఆందోళన వెలిబుచ్చారు. ఇవి అమెరికా కేంద్ర బ్యాంకును అథ:పాతాళంలోకి నెట్టాయని..
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెచ్చిన ప్రపంచ వాణిజ్య యుద్ధం తలనొప్పిగా మారిందని అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ అన్నారు. ఇది అమెరికాలో అధిక ద్రవ్యోల్బణానికి దారి తీసే అవకాశం ఉందన్నారు. ట్రంప్ పరిపాలనలో తెచ్చిన విధానపరమైన మార్పులు అమెరికా కేంద్ర బ్యాంకును అథ:పాతాళంలోకి నెట్టాయని ఆయన వ్యాఖ్యానించారు. చికాగోలో నిర్వహించిన ఒక సదస్సులో ప్రసంగిస్తూ పావెల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటివరకు ప్రకటించిన సుంకాల పెంపుదల స్థాయి "ఊహించిన దానికంటే చాలా పెద్దది" ఈ సమస్య చుట్టూ ఉన్న దీర్ఘకాలిక అనిశ్చితి, శాశ్వత ఆర్థిక నష్టాన్ని కలిగించవచ్చని పావెల్ పేర్కొన్నారు. "ఇవి చాలా ప్రాథమిక విధాన మార్పులు... దీని గురించి ఎలా ఆలోచించాలో కూడా నాకు తాజా అనుభవం లేదు" అని పావెల్ అన్నారు. ఉపాధిని ప్రోత్సహించడం, ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడం ఫెడ్ యొక్క పని, కానీ ట్రంప్ సుంకాలు ఆ రెండు లక్ష్యాలను సవాల్ చేస్తున్నాయని పావెల్ హెచ్చరించారు. తాజా డేటా ప్రకారం US ఆర్థిక వ్యవస్థ మంచి స్థితిలోనే ఉందని, కానీ, భవిష్యత్‌లో ఆర్థిక వ్యవస్థ మందగిస్తుందని ఆయన అన్నారు.
ట్రంప్ వాణిజ్య యుద్ధం స్టాక్‌లను తాకిందని, ఆ అస్థిరత వాల్ స్ట్రీట్‌లో కనిపించిందని అన్నారు. ఫలితంగా నాస్‌డాక్ ఒక సమయంలో నాలుగు శాతానికి పైగా, S&P మూడు శాతానికి పైగా, డౌ జోన్స్ రెండు కంటే ఎక్కువ పడిపోయాయని గుర్తు చేశారు. సెమీకండక్టర్లపై ట్రంప్ కొత్త ఎగుమతి ఆంక్షల కారణంగా Nvidia 10 శాతానికి పైగా పడిపోయిందని చెప్పారు. అయితే, అమెరికా అధ్యక్షుడు మాత్రం ఉత్సాహంగా ఉన్నారని, జపాన్‌తో వాణిజ్య ఒప్పందంపై చర్చల్లో "పెద్ద పురోగతి!" ఉందని సోషల్ మీడియాలో పోస్ట్‌లు కూడా చేసుకుంటున్నారని పావెల్ ఎద్దేవా చేశారు.
అటు, ఇదే అంశంపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు అతి పెద్ద ఆర్థిక ప్రత్యర్థి అయిన చైనాతో తీవ్ర ఘర్షణ మంచిది కాదన్నారు. "సంభాషణ, చర్చల ద్వారా US నిజంగా సమస్యను పరిష్కరించుకోవాలనుకుంటే, అది మొదటగా తీవ్ర ఒత్తిడిని కల్పించే చర్యల్ని ఆపాలని ట్రంప్ కు సలహా ఇచ్చారు లిన్. బెదిరింపులు, బ్లాక్‌మెయిల్ చేయడం మానేయాలని హితవు పలికారు. సమానత్వం, గౌరవం, పరస్పర ప్రయోజనం ఆధారంగా చైనాతో మాట్లాడాలని సలహా ఇచ్చారు." ఈ టారిఫ్‌ల యుద్ధంలో విజేత ఎవరూ లేరని లిన్ అన్నారు. "చైనా పోరాడటానికి ఇష్టపడదు, కానీ పోరాడటానికి భయపడదు." అని తేల్చి చెప్పారు.
ఇవి కూడా చదవండి:
WhatsApp Security: మీ వాట్సాప్ అకౌంట్ హ్యాక్ అయిందా..ఇలా ఈజీగా మళ్లీ యాక్సెస్ పొందండి..
Scam Payments: మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్.. జర జాగ్రత్త..
Bill Gates: వారానికి మూడు రోజేలే పని..బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
iPhone like Design: రూ.6 వేలకే ఐఫోన్ లాంటి స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు తెలిస్తే షాక్ అవుతారు..
Monthly Income: 50 ఏళ్ల తర్వాత నెలకు రూ.లక్ష కావాలంటే ఎంత సేవ్ చేయాలి, ఎన్నేళ్లు చేయాలి
Read More Business News and Latest Telugu News
Updated Date - Apr 17 , 2025 | 08:11 PM