US Businessman: ఉద్యోగులకు 2 వేల కోట్ల బోనస్
ABN, Publish Date - Dec 27 , 2025 | 03:36 AM
ఆ కంపెనీ యజమాని ఔదార్యం గురించి వింటే, ఎంతటి దాన కర్ణుడో కదా.! ఆ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు ఎంత అదృష్టవంతులో కదా...
కంపెనీ అమ్మేసిన సందర్భంగా ఓ అమెరికా వ్యాపారి ఔదార్యం
న్యూఢిల్లీ, డిసెంబరు 26: ఆ కంపెనీ యజమాని ఔదార్యం గురించి వింటే, ఎంతటి దాన కర్ణుడో కదా.! ఆ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు ఎంత అదృష్టవంతులో కదా.! అని అనుకోకమానరు. సుమారు రూ. 2,155 కోట్లు (240 మిలియన్ డాలర్లు) తన కంపెనీలో పనిచేసే 540 మంది ఉద్యోగులకు బోన్‌సగా ఇచ్చేశాడు అమెరికాకు చెందిన వ్యాపారవేత్త గ్రహం వాకర్. లూసియానాకు చెందిన గ్రహం వాకర్.. తన కుటుంబ కంపెనీ ఫైబర్‌బాండ్‌ను అమ్మిన సందర్భంగా ఉద్యోగులకు ఆ బోనస్ ప్రకటించాడు. దీంతో ఒక్కో ఉద్యోగి సుమారు 4 కోట్లు పొందారు. తన కంపెనీని కొనుగోలు చేసిన మొత్తంలో 15ు ఉద్యోగులకు ఇవ్వాలని టేకోవర్ చేసిన కంపెనీకి కండిషన్ పెట్టి గొప్ప మనసు చాటుకున్నాడు. కష్టకాలంలోనూ కంపెనీని వదలకుండా తనకు తోడుగా ఉన్న ఉద్యోగుల రుణం అలా తీర్చుకున్నాడు. జూన్ నుంచి ఈ బోనస్ చెల్లింపులు ప్రారంభమయ్యాయని వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. నిర్దిష్ట కాలంలో సంస్థలో పనిచేసిన వారికి 5 ఏళ్ల లోపు ఈ చెల్లింపులు జరుగుతాయని తన కథనంలో తెలిపింది. తమ యజమాని ఔదార్యం చూసి ఉద్యోగులు ఉబ్బితబ్బిబ్బయ్యారు. నిజానికి కంపెనీలో షేర్లు ఉంటేనే ఆ కంపెనీని అమ్మేసేటపుడు ఉద్యోగికి వాటా ఇస్తారు. కానీ వాకర్ ఎలాంటి షేర్లు లేకపోయినా మానవత్వంతో డబ్బు పంచాడు. 1982లో గ్రహం వాకర్ తండ్రి క్లాడ్ వాకర్ ఈ ఫైబర్‌బాండ్ కంపెనీని స్థాపించారు. 1998లో అగ్నిప్రమాదం జరిగి సంస్థ పూర్తిగా నేలమట్టమైంది. అయినా క్లాడ్ వాకర్ ఉద్యోగులకు జీతాలు చెల్లించడం ఆపలేదు. ఆ తర్వాత కంపెనీ కోలుకుంది.
Updated Date - Dec 27 , 2025 | 03:36 AM