ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

President Trump: రష్యాతో వ్యాపారం చేస్తే 500శాతం టారిఫ్‌

ABN, Publish Date - Nov 18 , 2025 | 04:00 AM

రష్యాతో వ్యాపారాలు చేసే దేశాలపై మరింత కఠినంగా వ్యవహరించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయించుకున్నారు. రష్యా నుంచి వస్తువులను దిగుమతి చేసుకునే భారత్‌ వంటి కొన్ని....

  • సెనెట్‌లో ట్రంప్‌ బిల్లు

  • మరింత కఠినంగా వ్యవహరిస్తామని ప్రకటన

  • భారత్‌పై తీవ్ర ప్రభావం

వాషింగ్టన్‌, నవంబరు 17: రష్యాతో వ్యాపారాలు చేసే దేశాలపై మరింత కఠినంగా వ్యవహరించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయించుకున్నారు. రష్యా నుంచి వస్తువులను దిగుమతి చేసుకునే భారత్‌ వంటి కొన్ని దేశాలపై ఇప్పటికే సుంకాలను 25ు వరకు పెంచారు. దానికితోడు మరో 25ు జరిమానా విధించారు. దాంతో అమెరికా విధించే టారిఫ్‌ 50 శాతానికి పెరిగింది. అది చాలదన్నట్టుగా టారి్‌ఫను ఏకంగా 500 శాతానికి పెంచాలని ప్రతిపాదించారు. ఈ మేరకు సోమవారం సెనేట్‌లో బిల్లును ప్రవేశపెట్టారు. అది ఆమోదం పొందితే రష్యాతో వ్యాపారం చేసే అన్ని దేశాలపై సుంకాలు పెంచే చట్టబద్ధ అధికారం అమెరికాకు లభిస్తుంది. దీనిపై ఉదయం మీడియాతో మాట్లాడుతూ ‘రష్యాతో వ్యాపారం చేసే దేశమేదైనా సరే చాలా భారీగా ఆంక్షలు మోపుతామ’ని స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌పై దాడి చేసిన దగ్గర నుంచి గత మూడేళ్లుగా పలు రూపాల్లో రష్యాపై ఆంక్షలు విధిస్తున్న ట్రంప్‌ ప్రస్తుతం ఆ దేశంతో వ్యాపారాలు చేసే దేశాలపైనా మరింత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. ఆ దేశాలు అమెరికాకు చేసే ఎగుమతులపై అతి భారీగా పన్నులు పెంచాలని నిర్ణయించారు. ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం భారత్‌పై తీవ్ర ప్రభావం చూపనుంది. రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు చేయడాన్ని నిలిపివేయాలని ఇప్పటికే భారత్‌కు గట్టిగా చెప్పారు. ఈ నేపథ్యంలో భారత్‌ కూడా కొనుగోళ్లను నిలిపివేసిందని గత నెలలో ఆయన ప్రకటించారు. మరోవైపు ద్వైపాక్షిక వాణిజ్యంపై భారత్‌-అమెరికాల మధ్య జరుగుతున్న చర్చలు కీలక దశకు చేరుకున్న సమయంలో ట్రంప్‌ తీసుకొస్తున్న తాజా బిల్లు తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ కారణంగా భారత్‌ కొన్ని అంశాల్లో తగ్గాల్సిన పరిస్థితి ఎదురయింది. ప్రస్తుతం విధిస్తున్న 50 శాతం టారి్‌ఫల కారణంగా గత అయిదు నెలల్లో భారత్‌ నుంచి అమెరికాకు జరిగే ఎగుమతులు 37 శాతం పడిపోయాయి. క్రిస్మస్‌ పండగ కోసం పెట్టే దుస్తుల ఆర్డర్లలోనూ తగ్గుదల కనిపించింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో చర్చలు ద్వారా తగిన సర్దుబాట్లు చేసుకొని బయటపడాల్సి ఉంటుందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు ఒక్క రష్యానే కాకుండా, ఇరాన్‌తోనూ వ్యాపారాలు చేసే దేశాలపైనా ఇదేవిధంగా భారీగా ఆంక్షలు విధిస్తామని ట్రంప్‌ స్వయంగా చెప్పడం గమనార్హం.

Updated Date - Nov 18 , 2025 | 04:00 AM