US B2 Bomber: యూఎస్ బీ2 బాంబర్లు ఎక్కడ.. ఇరాన్‌పై దాడి తర్వాత ఏమయ్యాయి..
ABN, Publish Date - Jul 02 , 2025 | 12:29 PM
US B2 Bomber: మొదటి గ్రూపులోని ఫైటర్ జెట్లు పసిఫిక్ మహా సముద్రం పడమర వైపు వెళ్లాయి. అవి గువామ్ ఎయిర్ బేస్ వైపు వెళ్లినట్లు తెలుస్తోంది. రెండో గ్రూపులోని ఏడు బీ2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్స్ ఇరాన్ న్యూక్లియర్ సైట్లపై దాడి చేశాయి.
ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నపుడు అమెరికా మధ్యలోకి దూరింది. ఇజ్రాయెల్ దేశానికి పూర్తి మద్దతునిచ్చింది. అంతేకాదు.. ఇరాన్ న్యూక్లియర్ సైట్లపై బీ2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్స్‌తో దాడులు సైతం చేసింది. ఈ దాడుల్లో ఇరాన్ న్యూక్లియర్ సైట్లు భారీగా దెబ్బతిన్నాయి. అయితే.. ఇరాన్ న్యూక్లియర్ సైట్లపై దాడి చేసిన తర్వాత యూఎస్ బీ2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్స్ ఏమయ్యాయి అన్నది మిస్టరీగా మారింది. వాటి ఉనికిపై మీడియాలో, సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే జూన్ 23వ తేదీన ’ది పెంటగాన్‘ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ పేరిట ఇరాన్ న్యూక్లియర్ సైట్లపై అమెరికన్ బీ2 బాంబర్స్ దాడి చేశాయి. దాడి చేసిన తర్వాత మళ్లీ అమెరికాకు తిరిగి వచ్చేశాయి. ప్రస్తుతం మిస్సోరీలోని వైట్‌మ్యాన్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో ఉన్నాయి’ అని స్పష్టం చేసింది. అయితే, బీ2 బాంబర్స్ లోని ఓ బాంబర్ ఆచూకీ తెలియటం లేదు. జూన్ 21వ తేదీన రెండు గ్రూపులకు చెందిన బీ2 బాంబర్ వైట్‌మ్యాన్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి గాల్లోకి లేచాయి.
మొదటి గ్రూపులోని బాంబర్స్ పసిఫిక్ మహా సముద్రం పడమర వైపు వెళ్లాయి. అవి గువామ్ ఎయిర్ బేస్ వైపు వెళ్లినట్లు తెలుస్తోంది. రెండో గ్రూపులోని ఏడు బీ2 బాంబర్స్ ఇరాన్ న్యూక్లియర్ సైట్లపై దాడి చేశాయి. మూడు న్యూక్లియర్ సైట్లపై 14 GBU-57 MOP బంకర్ బస్టర్ బాంబ్స్‌ను వేశాయి. బాంబు దాడి తర్వాత అవి అమెరికాకు ప్రయాణం అయ్యాయి. దాదాపు 37 గంటలు ప్రయాణించి వైట్‌మ్యాన్ ఎయిర్ బేస్‌కు చేరుకున్నాయి. అయితే, మొదటి గ్రూపులోని ఓ బాంబర్ డేనియల్ కే ఇనోయి ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయినట్లు సమాచారం. ఈ ఎయిర్ పోర్టు హవాయ్‌లో ఉంది. ఆ బాంబర్ గత కొద్ది రోజులనుంచి అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి..
ఏసీ కావాలంటూ నవ వధువుకు వేధింపులు.. - పెళ్ళయిన నాలుగో రోజే ఆత్మహత్య
సినిమాను తలపించే బ్యాంకు దోపిడి.. చిన్న తప్పుతో..
Updated Date - Jul 02 , 2025 | 06:09 PM