Trump Warns Maduro: ప్రాణాలతో ఉండాలంటే దేశం విడిచి వెళ్లండి
ABN, Publish Date - Dec 02 , 2025 | 04:37 AM
వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను తక్షణమే దేశం విడిచి వెళ్లాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తుది హెచ్చరిక జారీ చేశారు. దేశం విడిచి వెళ్తే మదురోతో పాటు ఆయన కుటుంబాన్ని...
వెనెజువెలా అధ్యక్షుడు మదురోకు ట్రంప్ తుది హెచ్చరిక
వాషింగ్టన్ డీసీ, డిసెంబరు 1: వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను తక్షణమే దేశం విడిచి వెళ్లాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తుది హెచ్చరిక జారీ చేశారు. దేశం విడిచి వెళ్తే మదురోతో పాటు ఆయన కుటుంబాన్ని, సన్నిహితులను ప్రాణాలతో వదిలేస్తామని ట్రంప్ చెప్పినట్లు మియామి హెరాల్డ్ కథనం ప్రచురించింది. ముదురోతో ఇటీవల ఫోన్‌లో మాట్లాడిన ట్రంప్ సంభాషణ సందర్భంగా ఈ హెచ్చరిక జారీ చేసినట్లు కథనంలో ఉంది. అయితే ఈ ప్రతిపాదనకు మదురో ఒప్పుకోలేదని, తనకు, తన పరివారానికి, సన్నిహితులకు క్షమాభిక్ష ప్రసాదించాలని కోరారని కథనం పేర్కొంది.
Updated Date - Dec 02 , 2025 | 04:37 AM