President Trump warned: తక్షణమే ఆయుధాలు వీడండి
ABN, Publish Date - Dec 31 , 2025 | 04:18 AM
ఇజ్రాయెల్‌తో చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందం మేరకు హమాస్ తక్షణమే ఆయుధాలను వీడాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తేల్చిచెప్పారు...
హమా్‌సకు ట్రంప్ హెచ్చరిక
ఫ్లోరిడా, డిసెంబరు 30: ఇజ్రాయెల్‌తో చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందం మేరకు హమాస్ తక్షణమే ఆయుధాలను వీడాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తేల్చిచెప్పారు. లేకుంటే హమాస్ భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. హమా్‌సను లక్ష్యంగా చేసుకోడానికి ఇతర దేశాలు కూడా ముందుకొచ్చాయన్నారు. అయితే, ఆ దేశాలు ఏవో ఆయన వెల్లడించలేదు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూతో తాజాగా ద్వైపాక్షిక సమావేశాన్ని ట్రంప్ నిర్వహించారు. అనంతరం ఆ వివరాలను మీడియాకు వివరించారు. ‘ఆయుధాలు వీడేందుకు హమా్‌సకు చాలా తక్కువ సమయం ఇస్తున్నా. పశ్చిమాసియాలో శాంతి కోసం కృషి చేస్తున్న నా ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్, నా అల్లుడు జేర్డ్ కుష్నెర్..ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తారు’ అని ట్రంప్ తెలిపారు. కాగా, ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్-పాక్ మధ్య ఘర్షణ సహా 8 యుద్ధాలను ఆపానని ట్రంప్ మళ్లీ వ్యాఖ్యానించారు. భారత్-పాక్ కాల్పుల విరమణ చర్చల్లో కీలక పాత్ర పోషించారంటూ ట్రంప్ సలహాదారు రికీగిల్‌కు అమెరికా ప్రభుత్వం అవార్డు ప్రదానం చేసింది. కాగా, వచ్చే ఏడాది భారత్-పాకిస్థాన్‌ల మధ్య మరోసారి యుద్ధం జరిగే అవకాశం ఉందని అమెరికా మేధావుల బృందం ఒకటి అంచనా వేసింది. భారత్‌లో ఉగ్రవాదుల దాడులు పెరగడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.
Updated Date - Dec 31 , 2025 | 04:18 AM