Donald Trump Targets India: అమెరికాను చమురు బేహారిగా మార్చేందుకే
ABN, Publish Date - Aug 06 , 2025 | 05:48 AM
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌ను పదేపదే ఎందుకు బెదిరిస్తున్నారు? సుంకాల మీద సుంకాలు
భారత్‌పై ట్రంప్ చింతనిప్పులు అందుకే
రష్యాను కాదని, అమెరికా చమురు కొంటే భారత్‌కు 11 బిలియన్ డాలర్ల నష్టం
న్యూఢిల్లీ/వాషింగ్టన్, ఆగస్టు 5: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌ను పదేపదే ఎందుకు బెదిరిస్తున్నారు? సుంకాల మీద సుంకాలు బాధుతానని ఎందుకు ప్రకటనలు చేస్తున్నారు?? ఈ ప్రశ్నలకు భారత్‌కు చమురు అమ్మేందుకే ట్రంప్ ఈ ఎత్తుగడలు వేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వ్యూహాత్మకంగా భారత్‌పై ఒత్తిడి పెంచి.. తన దారికి తెచ్చుకోవాలనే ఉద్దేశంతోనే ట్రంప్ ప్రకటనలు కనిపిస్తున్నాయి. అమెరికాలోని చమురు లాబీకి మద్దతివ్వడంతోపాటు.. అంతర్జాతీయ ఇంధన వ్యాపారాన్ని తనవైపు మళ్లించుకోవాలనే ఉద్దేశంతో ట్రంప్ ఓ లెక్కతో ముందుకు సాగుతూ.. ‘వ్యూహాత్మక మిత్ర దేశాల’పై ఆర్థిక ఒత్తిడిని పెంచుతున్నారు. భారత్ ప్రస్తుతం తన అవసరాల్లో 40ు చమురును రష్యా నుంచి కొనుగోలు చేస్తోంది. రష్యా చమురు చవకగా లభించడమే కాకుండా.. అమెరికా డాలర్లలో కాకుండా.. భారతీయ రూపాయల్లోనే కొనుగోళ్లకు అవకాశముండడమే ఇందుక్కారణం..! రష్యా నుంచి ఈ ఏడాది జనవరి నుంచి రోజుకు సగటున 17.5 లక్షల బ్యారెళ్ల మేర ముడి చమురు భారత్‌కు దిగుమతి అవుతోంది. నిజానికి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పుడు అమెరికా ప్రభుత్వమే.. అంతర్జాతీయంగా చమురు ధరలను స్థిరంగా ఉంచేందుకు మాస్కో నుంచి చమురు కొనాలని భారత్‌ను కోరింది. ఇటీవల ట్రంప్ వ్యూహాత్మకంగా భారత్‌ను టార్గెట్‌గా చేసుకుంటూ రావడానికి కూడా ఓ లెక్క ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా డాలర్‌ను బలహీనపరిచేందుకు బ్రిక్స్ దేశాలు ప్రయత్నిస్తున్నాయని ఇటీవల ఆరోపించారు. రష్యా చమురును రూపాయల్లో కొనుగోలు చేయడం కూడా ఇందులో భాగమేనని అమెరికా భావిస్తోంది. అమెరికాను ప్రపంచ చమురు బేహారిగా మార్చాలని ట్రంప్ కంకణం కట్టుకున్నారు. అందుకే.. అమెరికా చమురు సంస్థలకు 18 బిలియన్ డాలర్ల(రూ.1.5 లక్షల కోట్లు) మేర ప్రోత్సాహకాలను ప్రకటించారు. భారత్ లాంటి అతిపెద్ద చమురు వినియోగ దేశాలను తనవైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
అమెరికా నుంచి ఎంత?
నిజానికి ఈ ఏడాది ప్రథమార్థంలో అమెరికా నుంచి కొనే చమురును భారత్ 50ు పెంచింది. అయినా.. భారత అవసరాల్లో ఇది కేవలం 8ు మాత్రమే..! భారత్ కనీసం తన చమురు అవసరాల్లో 20% అమెరికా నుంచి కొనుగోలు చేస్తే.. ఈ రంగంలో అమెరికా ప్రాబల్యం పెరుగుతుంది. అందుకే ట్రంప్ బెదిరింపుల్లా కాకుండా.. భారత్‌పై ఒత్తిడి పెంచేలా.. వ్యూహాత్మకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజా సుంకాల పెంపుతో.. భారత్‌కు ఏటా 18 బిలియన్ డాలర్ల(రూ.1.5 లక్షల కోట్లు) మేర నష్టం వాటిల్లే ప్రమాదముంది. అయితే.. రష్యాను కాదని, అమెరికా వద్ద ఎక్కువ ధరకు చమురు కొనుగోలు చేస్తే.. 11 బిలియన్ డాలర్ల(రూ.91,500 కోట్లు) చేతిచమురు తప్పదు. ఈ రెండింటినీ బేరీజు వేసి చూస్తే.. అమెరికాతో చమురు ఒప్పందాలు చేసుకుంటే.. భారత్‌కు 7 బిలియన్ డాలర్ల(రూ.58 వేల కోట్లు) మేర మిగులు ఉంటుందనేది ట్రంప్ లెక్కగా తెలుస్తోంది.
అమెరికాపై భారత సైన్యం వ్యంగ్యాస్త్రాలు
ట్రంప్ బెదిరింపులపై భారత సైన్యం వ్యంగ్యాస్త్రాలను సంధించింది. 1971 ఆగస్టు 5 నాటి ఓ పేపర్ క్లిప్పింగ్‌ను షేర్ చేస్తూ.. అమెరికా తీరును ఎండగట్టింది. ఆ క్లిప్పింగ్ ప్రకారం భారత్-పాకిస్థాన్ యుద్ధానికి ముందు.. పాకిస్థాన్‌కు అమెరికా ఆయుధాలను సరఫరా చేసింది. దీనిపై అప్పటి రక్షణ ఉత్పత్తుల శాఖ మంత్రి వీసీ శుక్లా రాజ్యసభలో ఓ ప్రకటన చేశారు. ‘‘ఆయుధాల కోసం నాటో, సోవియట్ యూనియన్లతో పాకిస్థాన్ సంప్రదింపులు జరిపింది. అయితే.. ఆ దేశాలు నో చెప్పాయి. కానీ, అమెరికా మాత్రం పాకిస్థాన్‌కు మద్దతిస్తూ.. ఆయుధాలను సరఫరా చేస్తూనే ఉంది’’ అని వ్యాఖ్యానించినట్లు ఆ పేపర్ క్లిప్పింగ్ స్పష్టం చేస్తోంది. ‘ఇప్పుడు కూడా ట్రంప్ పాకిస్థాన్‌పై దయ చూపుతున్నారా? వారిపై టారి్‌ఫలను 19శాతానికి తగ్గించారు’’ అని భారత సైన్యం పేర్కొంది.
Updated Date - Aug 06 , 2025 | 05:48 AM