ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Donald Trump: మునీర్‌, షరీఫ్‌ గొప్పవాళ్లు

ABN, Publish Date - Oct 27 , 2025 | 01:36 AM

పాక్‌ ఫీల్డ్‌ మార్షల్‌ ఆసిమ్‌ మునీర్‌, పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ గొప్పవాళ్లని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీర్తించారు. పాక్‌-అఫ్గాన్‌ సంక్షోభాన్ని...

  • మలేసియా పర్యటనలో ట్రంప్‌ ప్రశంస

కౌలాలంపూర్‌, అక్టోబరు 26: పాక్‌ ఫీల్డ్‌ మార్షల్‌ ఆసిమ్‌ మునీర్‌, పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ గొప్పవాళ్లని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీర్తించారు. పాక్‌-అఫ్గాన్‌ సంక్షోభాన్ని తాను సునాయాసంగా పరిష్కరించగలనని చెప్పారు. మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో జరిగిన ఆసియాన్‌ సదస్సులో భాగంగా థాయ్‌లాండ్‌-కాంబోడియా దేశాల మధ్య శాంతి ఒప్పందంపై సంతకాల వేళ ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను 8 నెలల్లో నెలకొకటి చొప్పున మొత్తం 8 యుద్ధాలు ఆపానని చెప్పారు. ఇప్పటివరకు ఏ ఇతర అమెరికా అధ్యక్షుడు కూడా ఒక్క యుద్ధం కూడా ఆపలేదన్నారు. మిగతా అధ్యక్షులు యుద్ధాలు చేస్తే తాను యుద్ధాలు ఆపి లక్షల మంది ప్రాణాలు కాపాడానని చెప్పారు. చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదని, భవిష్యత్తులో కూడా జరిగే అవకాశం లేదన్నారు. అంతకుముందు ఆసియాన్‌ సదస్సులో పాల్గొనేందుకు కౌలాలంపూర్‌కు చేరుకున్న ట్రంప్‌నకు మలేసియా ప్రధాని అన్వర్‌ ఇబ్రహీం ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తనను ఆహ్వానించేందుకు ఎయిర్‌పోర్ట్‌లో ఏర్పాటు చేసిన సంప్రదాయ నృత్య బృందాన్ని చూసి ట్రంప్‌ ఆగలేకపోయారు.వారి దగ్గరకు వెళ్లి హుషారుగా స్టెప్పులేశారు. మలేసియా ప్రధాని కూడా స్టెప్పులేశారు.

Updated Date - Oct 27 , 2025 | 01:36 AM