Trump On Kashmir: కశ్మీర్ అంశం.. భారత్, పాక్‌ల ద్వైపాక్షిక వ్యవహారమే: శ్వేత సౌధం అధికారి
ABN, Publish Date - Sep 26 , 2025 | 07:45 AM
కశ్మీర్ విషయంలో ట్రంప్‌కు ఎలాంటి ఆసక్తి లేదని శ్వేత సౌధం అధికారి ఒకరు తెలిపారు. అయితే, వివాదం పరిష్కారం కోసం సాయం కోరితే మాత్రం ఆయన తను చేయగలిగింది చేస్తారని పేర్కొన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: కశ్మీర్ అంశం భారత్, పాక్‌ల మధ్య ద్వైపాక్షిక వ్యవహారమని శ్వేత సౌధం అధికారి ఒకరు స్పష్టం చేశారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలన్న ఆసక్తి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు లేదని తేల్చి చెప్పారు. తాజా పత్రికా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌పై వివాదం భారత్, పాక్‌ల ద్వైపాక్షిక అంశమన్న సిద్ధాంతానికి తాము కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. ఇప్పటికే ట్రంప్ అనేక వివాదాల పరిష్కారం కోసం ప్రయత్నిస్తూ బిజీగా ఉన్నారని కూడా తెలిపారు. అయితే, తన సాయం కోరితే మాత్రం ఆయన తప్పకుండా చేస్తారని వివరించారు. ఈ అంశాన్ని భారత్, పాక్‌లే పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు (Trump Kashmir issue).
భారత్, పాక్‌లతో వ్యవహారాలకు సంబంధించి అమెరికా తన ప్రాధాన్యాలకు పెద్ద పీట వేస్తుందని స్పష్టం చేశారు. అయితే, ఇటీవల భారత్, పాక్ ఘర్షణలు సద్దుమణగడంలో మాత్రం ట్రంప్ పాత్ర ఉందని స్పష్టం చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంలో అమెరికా పాత్ర ఉందన్నది ఓ వాస్తవమని కామెంట్ చేశారు (India Pakistan Kashmir US stance).
భారత్, పాక్ యుద్ధాన్ని ముగించడంలో తాను కీలక పాత్ర పోషించానని ట్రంప్ ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. ఇటీవల ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశాల సందర్భంగా కూడా ట్రంప్ మరోసారి తాను 7 యుద్ధాలను ఆపానని చెప్పుకొచ్చారు. భారత్-పాక్ ప్రస్తావన కూడా తెచ్చారు (Trump not intervening Kashmir).
కశ్మీర్ వివాదంలో మూడో దేశం జోక్యాన్ని తాము సహించబోమని భారత్ ఎప్పటి నుంచో చెబుతోంది. ఇటీవలి ఆపరేషన్ సిందూర్ తరువాత కాల్పుల విరమణ కోసం పాక్ స్వయంగా తమను సంప్రదించిందని స్పష్టం చేసింది. ఏప్రిల్ 22న పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల పహల్గాం దాడి తరువాత భారత్ మే 7న దాయాది దేశంపై ఆపరేషన్ సిందూర్ ప్రారంభించిన విషయం తెలిసిందే. భారత సాయుధ దళాలు జరిపిన దాడుల్లో పాక్‌తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో దాక్కున్న సుమారు 100 మంది ఉగ్రవాదులు అంతమయ్యారు.
ఇవి కూడా చదవండి:
ట్రంప్ మళ్లీ షాకింగ్ ప్రకటన..భారత ఔషధ ఎగుమతులకు దెబ్బ..
ఐరాసలో ట్రంప్‌కి ఎదురైన సాంకేతిక ఇబ్బందులు..దుర్మార్గపు కుట్ర అని ఆరోపణ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Sep 26 , 2025 | 07:46 AM