Share News

Trump UNO Conspiracy: ఐరాసలో ట్రంప్‌కి ఎదురైన సాంకేతిక ఇబ్బందులు..దుర్మార్గపు కుట్ర అని ఆరోపణ

ABN , Publish Date - Sep 25 , 2025 | 10:55 AM

న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుకోని సాంకేతిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. వాటిపై స్పందించిన ట్రంప్ దుర్మార్గపు కుట్రగా అభివర్ణిస్తూ, ఎస్కలేటర్‌గేట్‌గా పేర్కొన్నారు.

Trump UNO Conspiracy: ఐరాసలో ట్రంప్‌కి ఎదురైన సాంకేతిక ఇబ్బందులు..దుర్మార్గపు కుట్ర అని ఆరోపణ
Trump UNO Conspiracy

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఐక్యరాజ్య సమితి (UNO) సదస్సులో తన ప్రసంగం సందర్భంగా ఎదుర్కొన్న వరుస సాంకేతిక సమస్యలను మూడు దుర్మార్గపు సంఘటనలుగా అభివర్ణించి, వాటిని కుట్రగా పేర్కొన్నారు. న్యూయార్క్‌లో జరిగిన సమావేశంలో ఎస్కలేటర్, టెలిప్రాంప్టర్, సౌండ్ సిస్టమ్‌లో సమస్యలు తలెత్తడంతో ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనలను ఎస్కలేటర్‌గేట్‌గా పిలుస్తూ, వీటిపై వెంటనే విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.


తప్పిన ప్రమాదం

మంగళవారం న్యూయార్క్‌లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో ట్రంప్, ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ ఎస్కలేటర్‌ ఎక్కినప్పుడు, అది అకస్మాత్తుగా ఆగిపోయింది. ఆ క్రమంలో ట్రంప్ దంపతులు పడిపోకుండా జాగ్రత్తగా రైలింగ్‌ను పట్టుకున్నారు. కొంచెంలో ప్రమాదం తప్పింది. మేము ఇనుప మెట్లపై కిందపడి గాయపడకుండా తప్పించుకున్నామని ట్రంప్ తన సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. ఐరాస ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ ఈ సంఘటన గురించి వివరించారు. అమెరికా బృందంలోని ఒక వీడియోగ్రాఫర్ అనుకోకుండా ఎస్కలేటర్ భద్రతా విధానాన్ని ట్రిగ్గర్ చేసి ఉండవచ్చన్నారు. ట్రంప్ ఈ వివరణను నమ్మలేదు. ఇది కుట్రలో భాగమని ఆరోపించారు.


ప్రసంగంలో అంతరాయం

సదస్సులో తన ప్రసంగం సమయంలో ట్రంప్ ఎదుర్కొన్న మరో సమస్య టెలిప్రాంప్టర్ పనిచేయకపోవడం. ఎస్కలేటర్ సమస్య తర్వాత, ఇప్పుడు టెలిప్రాంప్టర్ కూడా పనిచేయడం లేదు. ఇదేంటని ట్రంప్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీంతో ఆయన తన ప్రసంగంలో కొంత భాగాన్ని స్వీయంగా కొనసాగించాల్సి వచ్చింది. ఈ సంఘటనలు యాదృచ్ఛికం కాదని, తనపై ఉద్దేశపూర్వకంగా జరిగిన కుట్రలని ట్రంప్ ఆరోపించారు.

ఒక్క మాట కూడా వినలేదు

ప్రసంగం తర్వాత, ట్రంప్ తన భార్య మెలానియాతో తన ప్రదర్శన గురించి అడిగినప్పుడు, ఆమె మీరు చెప్పిన ఒక్క మాట కూడా నాకు వినిపించలేదని సమాధానమిచ్చారు. దీనిని మూడో సాంకేతిక వైఫల్యంగా ట్రంప్ పేర్కొన్నారు. ఇవన్నీ యాదృచ్ఛికం కాదు, ఇది ఐరాసలో జరిగిన మూడు రెట్ల కుట్ర అని ఆయన పేర్కొన్నారు. ఈ సంఘటనలపై వెంటనే విచారణ జరపాలని, ఎస్కలేటర్ భద్రతా టేపులను సంరక్షించాలని ట్రంప్ డిమాండ్ చేశారు.


ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 25 , 2025 | 11:07 AM