ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Trump Likely to Visit India: త్వరలో భారత్‌కు ట్రంప్‌!

ABN, Publish Date - Sep 13 , 2025 | 03:29 AM

భారత్‌లో త్వరలో జరగనున్న క్వాడ్‌ దేశాధినేతల సదస్సుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హాజరయ్యే అవకాశం ఉందని భారత్‌కు అమెరికా రాయబారిగా.....

  • క్వాడ్‌ సదస్సుకు హాజరయ్యే అవకాశం

  • భారత్‌ను చైనాకు దూరం చేయడమే లక్ష్యం

  • భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్‌ వెల్లడి

వాషింగ్టన్‌, సెప్టెంబరు 12: భారత్‌లో త్వరలో జరగనున్న క్వాడ్‌ దేశాధినేతల సదస్సుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హాజరయ్యే అవకాశం ఉందని భారత్‌కు అమెరికా రాయబారిగా ట్రంప్‌ ఇటీవల నియమించిన సెర్గియో గోర్‌ తెలిపారు. గురువారం ఆయన సెనేట్‌ ఫారిన్‌ రిలేషన్స్‌ కమిటీతో మాట్లాడుతూ, ఈ సదస్సుకు హాజరవడంతో పాటు క్వాడ్‌ బలోపేతానికి ట్రంప్‌ కట్టుబడి ఉన్నారని వెల్లడించారు. ఆయన పర్యటనకు సంబంధించి ఇప్పటికే చర్చలు కూడా జరిగాయని పేర్కొన్నారు. ఈ ఏడాది చివర్లో క్వాడ్‌ దేశాధినేతల సదస్సును భారత్‌ నిర్వహించనుంది. దీనికి సంబంధించిన తేదీ ఇంకా ఖరారు కాలేదు. ఫిబ్రవరిలో అమెరికా పర్యటన సందర్భంగా ఈ సమావేశానికి హాజరు కావాలని ట్రంప్‌ను ప్రధాని మోదీ ఆహ్వానించారు. కాగా, భారత్‌తో సంబంధాలు బలోపేతం చేసుకోవడమే తమకు అత్యంత ప్రాధాన్యమని గోర్‌ స్పష్టం చేశారు. భారత్‌ను అమెరికాకు చేరువ చేయడంతో పాటు చైనాకు దూరం చేయడమే లక్ష్యమని చెప్పారు. ప్రస్తుతం అమెరికా, భారత్‌ మధ్య నెలకొన్న తాత్కాలిక అడ్డంకులు త్వరలోనే తొలగిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. భారత ప్రభుత్వం, ప్రజలతో తమ దేశానికి దశాబ్దాల నుంచి సత్సంబంధాలు ఉన్నాయని, చైనీయులతో కంటే కూడా అమెరికన్లతోనే వారికి సాన్నిహిత్యం ఎక్కువని గోర్‌ వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి..

కిర్క్ హత్య.. పోలీసుల కస్టడీలో అనుమానితుడు

చార్లీ కిర్క్ హత్య కేసులో అనుమానితుడి ఫొటో‌ను రిలీజ్ చేసిన ఎఫ్‌బీఐ

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 13 , 2025 | 03:29 AM