ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Trump Labels India a Drug Hub: డ్రగ్స్‌ అడ్డా భారత్‌

ABN, Publish Date - Sep 19 , 2025 | 06:53 AM

ప్రతీకార సుంకాలు విధించినా లొంగని భారత్‌పై విషప్రచారాన్ని అమెరికా ముమ్మరం చేసింది. అక్రమంగా డ్రగ్స్‌ ఉత్పత్తి, రవాణాకు భారత్‌ అడ్డాగా మారిందని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విమర్శించారు...

అక్రమంగా తయారీ, రవాణాకు స్థావరం

  • మరోసారి విషం చిమ్మిన డొనాల్డ్‌ ట్రంప్‌

  • చైనా, పాక్‌ సహా 23 దేశాలతో జాబితా

  • ప్రాణాంతక ‘ఫెంటానిల్‌’ పాపం చైనాదే

  • కాంగ్రె్‌సకు నివేదిక ఇచ్చిన అధ్యక్షుడు

వాషింగ్టన్‌, సెప్టెంబరు 18 : ప్రతీకార సుంకాలు విధించినా లొంగని భారత్‌పై విషప్రచారాన్ని అమెరికా ముమ్మరం చేసింది. అక్రమంగా డ్రగ్స్‌ ఉత్పత్తి, రవాణాకు భారత్‌ అడ్డాగా మారిందని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విమర్శించారు. కాంగ్రె్‌సకు తాజాగా సమర్పించిన ప్రెసిడెన్షియల్‌ డిటర్మినేషన్‌ రిపోర్టులో ఆయన ఆ ఆరోపణలు చేశారు. అమెరికా పౌరుల ప్రాణాలకు ముప్పుగా మారిన సింథటిక్‌ డ్రగ్‌ ‘ఫెంటానిల్‌’ ఉత్పత్తికి వాడే రసాయనాలను పెద్దఎత్తున సమకూరుస్తుందంటూ చైనాపై ట్రంప్‌ విరుచుకుపడ్డారు. డ్రగ్స్‌ అక్రమ రవాణాను అడ్డుకోలేకపోతున్నాయంటూ అఫ్ఘానిస్థాన్‌, బొలీవియా, మయన్మార్‌, కొలంబియా, వెనెజువెలాలపై ఆయన ధ్వజమెత్తారు. పాకిస్థాన్‌ పేరు కూడా ప్రస్తావించిన ఆయన ఈ జాబితాలో మొత్తం 23 దేశాలు ఉన్నాయన్నారు. అమెరికాలోకి అక్రమంగా వస్తున్న డ్రగ్స్‌ను తయారుచేస్తున్న ప్రధాన కేంద్రాలుగాను లేక రవాణా స్థావరాలుగాను ఈ దేశాలు పనిచేస్తున్నాయని ఆయన విమర్శించారు. డ్రగ్స్‌ను తయారుచేస్తున్న సంస్థలతోపాటు, వాటి అక్రమ రవాణాకు ఈ సంస్థలు వాడుకుంటున్న దేశాలూ ఇందుకు బాధ్యత పడాల్సిందేనని స్పష్టం చేశారు. ‘‘23 దేశాలను జాబితాలో పెట్టడంలో భౌగోళిక, ఆర్థిక, వాణిజ్య కారణాలను పరిగణనలోకి తీసుకున్నాం. ఇందులో ఏదో ఒక కారణం వల్ల డ్రగ్స్‌ తయారీకి, అందుకు అవసరమైన రసాయనాల సేకరణకు, ఉత్పత్తిచేసిన డ్రగ్స్‌ అక్రమ రవాణాకు ఈ దేశాలు స్థావరాలుగా మారాయి’’ అంటూ అమెరికా విదేశాంగ శాఖ వర్గాలను ఉటంకిస్తూ ఓ ఇంగ్లిష్‌ పత్రిక కథనం ప్రచురించింది.

భారతీయ వ్యాపారులపై అమెరికా వేటు

సింథటిక్‌ డ్రగ్‌ ఫెంటానిల్‌ను తయారీచేసి అమెరికాకు అక్రమంగా రవాణాచేసిన వ్యవహారంలో భారతీయ కార్పొరేట్లు, వ్యాపారులపై ఆ దేశం వేటు వేసింది. వారికి, వారి కుటుంబాలకు వీసాలను రద్దుచేస్తున్నట్టు ప్రకటించింది. భవిష్యత్తులోనూ అమెరికాలోకి వారి ప్రవేశాలను నిరోధిస్తుస్తామని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. సింథటిక్‌ డ్రగ్స్‌ నుంచి అమెరికాను రక్షించుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. దీనిపై ఇప్పటివరకు భారత్‌ స్పందించలేదు. అయితే, ఏదో కారణం చూపించి భారతీయులకు వీసాలను నియంత్రించడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. అక్రమ వలసదారులకు సహకరిస్తున్నారంటూ ఈ ఏడాది మేలో పలు ట్రావెల్‌ ఏజెన్సీల ఓనర్లు, నిర్వాహకుల వీసాలపై అమెరికా నియంత్రణ విధించింది.

ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 19 , 2025 | 06:53 AM