Donald Trump: మళ్లీ టారిఫ్ బాంబు పేల్చిన ట్రంప్
ABN, Publish Date - Aug 06 , 2025 | 07:54 PM
రష్యా వద్ద భారత్ చమురు కొనుగోలు చేయడం అమెరికా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏ మాత్రం ఇష్టం లేదు. ఆ క్రమంలో భారత్‌పై ఆయన తన ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. అలాంటి వేళ.. భారత్‌పై మరోసారి ప్రతీకార సుంకాన్ని పెంచారు.
వాషింగ్టన్, ఆగస్ట్ 06: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌పై టారిఫ్ బాంబు పేల్చారు. భారత్‌పై 25 శాతం అదనపు టారిఫ్‌లను ఆయన విధించారు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నందుకు గాను 25 శాతం మేర భారత్‌పై ఆయన టారిఫ్‌ను విధించారు. దీంతో భారత్‌పై మొత్తం 50 శాతం టారిఫ్‌లు విధిస్తూ ట్రంప్ సంతకం చేశారు.
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి డొనాల్డ్ ట్రంప్ ప్రపంచంలోని పలు దేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తున్నారు. ఆ క్రమంలో ఇప్పటికే భారత్‌పై సుంకాలు విధించారు. అయితే రష్యాతో భారత్ సన్నిహితంగా ఉండడం యూఎస్ దేశాధ్యక్షుడికి అంతగా రుచించడం లేదు. అదీకాక రష్యా నుంచి కారు చౌకగా చమురును భారత్ కొనుగోలు చేస్తోంది. ఈ చమురు భారత్ మళ్లీ విక్రయిస్తుంది. తద్వారా బహిరంగ మార్కెట్‌లో చమురు విక్రయించడం ద్వారా భారత్ లాభాలు గడిస్తుందంటూ డొనాల్డ్ ట్రంప్ ఇటీవల తన ఆక్రోశాన్ని వెళ్లగక్కారు.
దీంతో భారత్‌పై మరిన్ని సుంకాలు విధిస్తామని ఆయన ప్రకటించారు. అంతేకాకుండా.. భారత్ కోనుగోలు చేస్తున్న చమురు కారణంగా.. రష్యాకు భారీగా నిధులు సమకురుతున్నాయని ఆరోపించారు. ఆ నిధులతోనే ఉక్రెయిన్ పై రష్యా యద్ధం చేస్తుందంటూ విమర్శించారు. ఆ క్రమంలో భారత్‌పై భారీగా సుంకాలు విధిస్తామని ట్రంప్ ఇప్పటికే స్పష్టమైన ప్రకటన చేశారు. ఆ క్రమంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
మరోవైపు భారత్‌పై ట్రంప్ అనుసరిస్తున్న వైఖరిపై రిపబ్లికన్ పార్టీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆ పార్టీ నాయకురాలు నిక్కీ హేలీ అయితే ట్రంప్‌కు కీలక సూచనలు సైతం చేశారు. భారత్ లాంటి బలమైన మిత్ర దేశంతో అమెరికా తన సంబంధాలను దెబ్బ తీసుకోకూడదని ట్రంప్‌కు ఆమె హితవు పలికారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయకూడదు కానీ.. చైనా చేయవచ్చా? అంటూ ఆమె తన ఎక్స్ ఖాతా వేదికగా ట్రంప్‌ను నిలదీశారు. రష్యా నుంచి చైనా అత్యధికంగా చమురు కొనుగోలు చేస్తుందన్నారు. అలాంటి దేశానికి మాత్రం సుంకాల నుంచి 90 రోజుల్లో మినహాయింపు ఇచ్చారంటూ ట్రంప్‌కు చరుకలంటించారు. అలాగే చైనాకు పలు అనుమతులు ఇస్తూ.. భారత్ లాంటి బలమైన మిత్ర దేశానికి ప్రతీకార సుంకాలు పెంచి దూరం చేసుకోవద్దని ట్రంప్‌కు ఆమె హితవు పలికారు.
ఇవి కూడా చదవండి..
శ్రీకృష్ణుడే మొదటి రాయబారి.. సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు
గల్వాన్ వ్యాలీ వివాదంలో రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు వార్నింగ్
మరిన్ని అంతర్జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 06 , 2025 | 08:21 PM