Donald Trump: మస్క్‌తో నిరాశ చెందా: ట్రంప్
ABN, Publish Date - Jun 06 , 2025 | 04:51 AM
తాను ప్రతిపాదించిన ఫెడరల్ ప్రభుత్వ వ్యయ నియం త్రణ బిల్లును ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ వ్యతిరేకించడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
వాషింగ్టన్, జూన్ 5: తాను ప్రతిపాదించిన ఫెడరల్ ప్రభుత్వ వ్యయ నియం త్రణ బిల్లును ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ వ్యతిరేకించడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ బిల్లులోని ముఖ్యఅంశాలు తెలిసి కూడా వ్యతిరేకించారని, దాంతో తాను నిరాశ చెందానని చెప్పారు. ప్రభుత్వ వ్యయ నియంత్రణకు ఉద్దేశించిన ప్రభుత్వ సామర్థ్య విభాగం (డోగ్)కు మస్క్ అధిపతిగా ఉండడం, ఈ బిల్లును చూసిన తరువాత ఆ పదవికి రాజీనామా చేయడం గమనార్హం. గురువారం ట్రంప్ శ్వేత సౌధంలోని ఓవల్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఒక్క విద్యు త్తు వాహనాల అంశం తప్ప బిల్లులోని మిగిలిన అంశాలపై మస్క్‌కు అభ్యంతరాలు లేవని అన్నారు.
‘మస్క్‌కు ఎంతో చేశాను. ఇద్దరి మధ్య గొప్ప స్నేహం ఉంది. అది కొనసాగుతుందో లేదో చెప్ప లేను. ఆయన నా గురించి ఎంతో గొప్పగా చెప్పారు. చెడుగా ఒక్క మాట అనలేదు. అయినా ఆయనతో అసంతృప్తి చెందా’ అని వ్యా ఖ్యానించారు. ట్రంప్ వ్యాఖ్యలపై మస్క్ ఎక్స్‌లో స్పందిస్తూ వ్యయ నియంత్రణ బిల్లును తనకు చూపలేదని తెలిపారు. తన సహకారం లేకుంటే ఎన్నికల్లో ట్రంప్ గెలిచి ఉండేవారు కాదని అన్నారు.
Updated Date - Jun 06 , 2025 | 04:51 AM