ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Trump Criticizes Defense: రక్షణ శాఖ కాదు యుద్ధ శాఖ

ABN, Publish Date - Aug 27 , 2025 | 02:39 AM

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మరోసారి చిత్రమైన వ్యాఖ్యలు చేశారు. అమెరికా రక్షణ శాఖ పేరు తనకు..

  • అమెరికా టెక్‌ కంపెనీలపై డిజిటల్‌ ట్యాక్స్‌లువేసే దేశాలపై భారీగా సుంకాలు విధిస్తాచైనాతో స్నేహమే.. అయస్కాంతాల సరఫరా తగ్గిస్తే మాత్రం 200% సుంకాలు: ట్రంప్‌

వాషింగ్టన్‌, ఆగస్టు 26: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మరోసారి చిత్రమైన వ్యాఖ్యలు చేశారు. అమెరికా రక్షణ శాఖ పేరు తనకు నచ్చలేదన్నారు శ్వేతసౌధంలో దక్షిణ కొరియా అధ్యక్షుడితో భేటీ అనంతరం ట్రంప్‌ మీడియాతో మాట్లాడారు. ‘‘రక్షణ శాఖ.. ఈ పేరు నాకు నచ్చలేదు. దేన్నుంచి మనం రక్షించుకోవాలి? ఎందుకు రక్షించుకోవాలి? మొదట్లో దీనిని యుద్ధ శాఖగా పిలిచేవారు. అది బాగుండేది. మనకు రక్షించుకోవడం మాత్రమే కాదు.. దూకుడుగా ఉండటం కూడా కావాలి’’ అని పేర్కొన్నారు. మనకన్నా ఎక్కువగా రష్యా చమురు కొంటున్న చైనా విషయంలో మాత్రం భిన్నమైన వైఖరి అవలంబిస్తున్నారు. చైనాతో అమెరికా ‘గొప్ప బంధం’ కొనసాగిస్తుందని పేర్కొన్నారు. ప్రత్యేకమైన ‘రేర్‌ ఎర్త్‌’ అయస్కాంతాల అంశంలో చైనాకు పట్టు ఉందని, కానీ విమానయాన రంగానికి సంబంధించి అమెరికా ఆధిపత్యం కొనసాగుతోందని చెప్పారు. ఒకవేళ అయస్కాంతాల సరఫరా తగ్గిస్తే మాత్రం చైనాపై 200ు సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. అయితే అలా సుంకాలు విధించడం వల్ల చైనాతో వాణిజ్యం నడపలేమని పేర్కొన్నారు. కాగా, అమెరికాకు చెందిన అమెజాన్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, గూగుల్‌ వంటి కంపెనీలపై వివిధ దేశాలు డిజిటల్‌ సర్వీసుల పన్ను(డీఎస్టీ)లు వసూలు చేయడం సరికాదని ట్రంప్‌ పేర్కొన్నారు. అమెరికా టెక్నాలజీ కంపెనీలపై డిజిటల్‌ పన్నులు, నియంత్రణలు విధించే దేశాలపై భారీగా సుంకాలు విధిస్తానని సామాజిక మాధ్యమం ట్రూత్‌లో పోస్టు పెట్టారు.

Updated Date - Aug 27 , 2025 | 02:39 AM