ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Donald Trump: భారత్‌ పాక్‌ పోరును నేనే ఆపా

ABN, Publish Date - Jul 29 , 2025 | 04:20 AM

భారత్‌ పాక్‌ల మధ్య యుద్ధాన్ని తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మరోసారి చెప్పారు. తాను అమెరికా..

  • నేను అమెరికా అధ్యక్షుడిని కాకపోతే

  • ఆరు యుద్ధాలు జరుగుతుండేవి: ట్రంప్‌

లండన్‌, జూలై 28: భారత్‌-పాక్‌ల మధ్య యుద్ధాన్ని తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మరోసారి చెప్పారు. తాను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కాకపోయి ఉంటే ప్రస్తుతం ప్రపంచంలో ఆరు యుద్ధాలు జరుగుతుండేవని అన్నారు. స్కాట్‌లాండ్‌లో సోమవారం బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌తో చర్చల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘నేను లేకపోయి ఉంటే ఈ రోజున ఆరు ప్రధాన యుద్ధాలు జరుగుతుండేవి. భారత్‌-పాకిస్థాన్‌ల మఽధ్య యుద్ధం కొనసాగుతుండేది. వాణిజ్య సుంకాలను అస్త్రంగా చేసుకొని థాయిలాండ్‌-కంబోడియాల మధ్య యుద్ధాన్ని ఆపించా. రవాండా-డెమొక్రాటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో మధ్య శాంతి ఒప్పందం కుదిరేలా చేశా. సెర్బియా-కొసావోల మధ్య ఘర్షణ తలెత్తకుండా చూశా’’ అని చెప్పారు. గాజాలో ప్రస్తుత పరిస్థితి ఏమిటని ఓ విలేకరి ప్రశ్నించినప్పుడు ‘గాజాకు సహాయంగా అమెరికా చాలా ధనం పంపించింది. కానీ హమాస్‌ దాన్ని అపహరించింది’ అన్నారు.

ఇవి కూడా చదవండి..

22 నిమిషాల్లో ఆపరేషన్ సిందూర్ పూర్తి చేశాం: రాజ్‌నాథ్

పహల్గాం దాడికి అమిత్‌షా బాధ్యత తీసుకోవాలి: గౌరవ్ గొగోయ్

For More National News and Telugu News..

Updated Date - Jul 29 , 2025 | 04:20 AM