ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Afghan Cricketers: పాక్‌ వైమానిక దాడుల్లో ముగ్గురు అఫ్గాన్‌ క్రికెటర్ల మృతి

ABN, Publish Date - Oct 19 , 2025 | 03:28 AM

సరిహద్దుల్లో ఉద్రిక్తతల వేళ పక్తికా ప్రావిన్స్‌లో పాక్‌ జరిపిన వైమానిక దాడుల్లో ముగ్గురు అఫ్గాన్‌ క్రికెటర్లతో పాటు 14 మంది పౌరులు మృతిచెందారు.

  • దేశవాళీ క్రికెటర్లు కబీర్‌, సిబ్ఘతుల్లా, హరూన్‌ దుర్మరణం

కాబూల్‌/ఇస్లామాబాద్‌, అక్టోబరు 18: సరిహద్దుల్లో ఉద్రిక్తతల వేళ పక్తికా ప్రావిన్స్‌లో పాక్‌ జరిపిన వైమానిక దాడుల్లో ముగ్గురు అఫ్గాన్‌ క్రికెటర్లతో పాటు 14 మంది పౌరులు మృతిచెందారు. దేశవాళీ క్రికెట్‌ ఆడే కబీర్‌, సిబ్ఘతుల్లా, హరూన్‌ మృతిచెందినట్లు అఫ్గాన్‌ క్రికెట్‌ బోర్డ్‌ వెల్లడించింది. పక్తికా ప్రావిన్స్‌ రాజధాని శరణలో జరిగే ఫ్రెండ్లీ మ్యాచ్‌లో పాల్గొనేందుకు వచ్చి పాక్‌ దాడుల్లో మృతిచెందారని ఏసీబీ తెలిపింది. ఘటన నేపథ్యంలో వచ్చే నెలలో పాకిస్థాన్‌లో జరిగే ముక్కోణపు టి-20 సిరీ్‌సలో పాల్గొనరాదని ఏసీబీ నిర్ణయించింది. అయితే అఫ్గాన్‌ పాల్గొనకున్నా తాము ముక్కోణపు సిరీస్‌ నిర్వహిస్తామని పాక్‌ స్పష్టం చేసింది. ఇలా ఉండగా పాక్‌ వరుసగా రెండోరోజు కూడా అఫ్గాన్‌పై వైమానిక దాడులు నిర్వహించింది. తాజా దాడుల్లో పలువురు తాలిబన్‌ ఫైటర్లు హతమయ్యారని పాక్‌ సైనిక వర్గాలు తెలిపాయి. మరోవైపు ఖతార్‌ మధ్యవర్తిత్వంలో దోహాలో పాక్‌, అఫ్గాన్‌ ప్రతినిధుల మధ్య శాంతి చర్చలు జరిగాయి. చర్చల్లో రెండు దేశాల రక్షణ మంత్రులు, ఇంటలిజెన్స్‌ చీఫ్‌లు పాల్గొన్నారని తెలిసింది. కాల్పుల విరమణ కొనసాగుతున్నా పాక్‌ వైమానిక దాడులకు పాల్పడటంపై అఫ్గాన్‌ ప్రతినిధులు తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్లు సమాచారం. పాక్‌ సైన్యం సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకోవడంపై బదులు తీర్చుకుంటామని తాలిబన్‌ ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరించింది.

Updated Date - Oct 19 , 2025 | 03:35 AM