ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Texas GOP Leader Comments: టెక్సాస్‌లో హనుమాన్‌ విగ్రహ ఏర్పాటుపై సెనేటర్ తీవ్ర వ్యాఖ్యలు..

ABN, Publish Date - Sep 23 , 2025 | 10:20 AM

డంకన్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో చర్చకు దారి తీశాయి. హిందూ అమెరికన్ ఫౌండేషన్ డంకన్ కామెంట్లపై స్పందించింది. యాంటీ హిందూ వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మండిపడింది.

Texas GOP Leader Comments

హిందువుల ఆరాధ్య దైవం హనుమాన్‌పై అమెరికాలోని రిపబ్లికన్ పార్టీకి చెందిన ఓ నాయకుడు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశాడు. అమెరికాలో హిందూ దేవుడి విగ్రహం ఏర్పాటు చేయడాన్ని ఆయన తప్పుబట్టాడు. హనుమంతుడు కల్పిత హిందూ దేవుడంటూ దారుణంగా కామెంట్లు చేశాడు. ఇంతకీ సంగతేంటంటే.. అధికార రిపబ్లికన్ పార్టీకి చెందిన అలెగ్జాండర్ డంకన్ ప్రస్తుతం టెక్సాస్ సెనేట్‌గా ఉన్నాడు. పెద్ద హోదాలో ఉన్న అతడికి ఏం పోయేకాలం వచ్చిందో తెలీదు కానీ, టెక్సాస్‌లో హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని తప్పుబడుతున్నాడు.

డంకన్ శనివారం ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టాడు. ఆ పోస్టులో.. ‘టెక్సాస్ నగరంలో కల్పిత హిందూ దేవుడికి సంబంధించిన కల్పితమైన విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని ఎలా ఒప్పుకున్నారు. మనది క్రిష్టియన్ దేశం’ అని పేర్కొన్నాడు. మరో పోస్టులో బైబిల్‌లోని మాటల్ని రాసుకొచ్చాడు. ‘నీకు నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదు’ అని పేర్కొన్నాడు. డంకన్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో చర్చకు దారి తీశాయి. హిందూ అమెరికన్ ఫౌండేషన్ డంకన్ కామెంట్లపై స్పందించింది. యాంటీ హిందూ వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మండిపడింది.

90 అడుగుల హనుమాన్ విగ్రహం..

టెక్సాస్‌లోని షుగర్ ల్యాండ్‌లో అష్టలక్ష్మి గుడి ఉంది. ఆ గుడిలో 90 అడుగుల పొడువుతో హనుమాన్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ హనుమాన్ విగ్రహానికి ‘స్టాట్యూ ఆఫ్ యూనియన్’ అని పేరు పెట్టారు. హనుమాన్ విగ్రహానికి సంబంధించిన విడి భాగాలు చైనాలో తయారు అయ్యాయి. వాటిని టెక్సాస్‌కు తీసుకు వచ్చి అసెంబుల్ చేశారు. 2024 ఆగస్టు నెలలో విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. చిన్న జియర్ స్వామి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ విగ్రహం అమెరికాలో ఉన్న అతి పెద్ద విగ్రహాల్లో నాలుగవది కావటం విశేషం.

ఇవి కూడా చదవండి

ఆ మాత్రలకు దూరంగా ఉండండి.. అమెరికా అధ్యక్షుడి హెచ్చరిక..

మోదీ ‘స్వదేశీ’ పిలుపు.. జోహోకు మారిన కేంద్ర మంత్రి..

Updated Date - Sep 23 , 2025 | 10:44 AM