Ashwini Vaishnaw Switches To Zoho: మోదీ ‘స్వదేశీ’ పిలుపు.. జోహోకు మారిన కేంద్ర మంత్రి..
ABN , Publish Date - Sep 23 , 2025 | 08:50 AM
దాదాపు 150 దేశాల్లో ఈ కంపెనీ కార్యకలాపాలు సాగుతున్నాయి. 100 మిలియన్ల మంది కస్టమర్లు ఉన్నారు. స్టార్టప్‌ల దగ్గరి నుంచి ఫార్ట్యూన్ 500 ఫామ్‌లు కూడా జోహో కస్టమర్లు కావటం విశేషం.
భారత ప్రధాని నరేంద్ర మోదీ ‘స్వదేశీ’కి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ‘స్వదేశీ’లో భాగంగా భారతీయులందరూ వీలైనంత ఎక్కువగా స్వదేశీ వస్తువులు, సేవలకు ప్రాధాన్యత ఇవ్వాలని మోదీ పేర్కొన్నారు. ప్రధాని మోదీ ‘స్వదేశీ’ పిలుపుపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్టవ్ స్పందించారు. తాను మైక్రోసాఫ్ట్ ప్రత్యామ్నాయం ‘జోహో’కు మారుతున్నట్లు ప్రకటించారు. ఇకపై తాను స్వదేశీ ప్లాట్ ఫామ్ అయిన జోహోను మాత్రమే వాడతానని స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదిక ఓ పోస్టు పెట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశ ప్రజలందరూ స్వదేశీ వస్తువులు, సేవల్ని వినియోగించాలని కోరారు.
జోహో గురించి చెప్పాలంటే..
శ్రీధర్ వెంబు, టోనీ థామస్‌లు 1996లో జోహో కంపెనీని స్టార్ట్ చేశారు. కంపెనీ హెడ్ క్వార్టర్స్ చెన్నైలో ఉంది. ఇది సాఫ్ట్‌వేర్ ఆజ్ ఏ సర్వీస్ (SaaS) కంపెనీ. ఇది 55 రకాల క్లౌడ్ ఆధారిత బిజినెస్ టూల్స్‌ను అందిస్తుంది. అందులో ఈ మెయిల్, అకౌంటింగ్, హెచ్ఆర్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, సీఆర్ఎమ్‌తో పాటు చాలా రకాల సేవలు భాగమై ఉన్నాయి. అమెరికాతో సంబంధాలు ఉన్నప్పటికీ జోహో ‘మేడ్ ఇన్ ఇండియా’ కంపెనీనే. తమిళనాడునుంచే కంపెనీకి సంబంధించిన ప్రధాన కార్యకలాపాలు సాగుతున్నాయి.
దాదాపు 150 దేశాల్లో ఈ కంపెనీ కార్యకలాపాలు సాగుతున్నాయి. 100 మిలియన్ల మంది కస్టమర్లు ఉన్నారు. స్టార్టప్‌ల దగ్గరి నుంచి ఫార్ట్యూన్ 500 ఫామ్‌లు కూడా జోహో కస్టమర్లు కావటం విశేషం. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365, గూగుల్ వర్క్ స్పేస్ అందించే సేవలను కూడా జోహో అందిస్తోంది. జోహో అందిస్తున్న సర్వీసుల్లో జోహో రైటర్, జోహో షీట్, జోహో షో, జోహో నోట్ బుక్, జోహో వర్క్ డ్రైవ్, జోహో మెయిల్, జోహో మీటింగ్, జోహో కాలెండర్ ప్రధానమైనవిగా ఉన్నాయి.
ఇవి కూడా చదవండి
ఈ రెండింటిలో ఏది మంచిది.. వాకింగ్..? సైక్లింగ్..?
బీజేపీ నేత కారులో భారీ కొండ చిలువ..