Share News

Walking Or Cycling: వాకింగ్..? సైక్లింగ్..? ఈ రెండింటిలో ఏది మంచిది?

ABN , Publish Date - Sep 23 , 2025 | 08:22 AM

జీవితమంటేనే ఒత్తడి మయం. అలాంటి ఒత్తిడి నుంచి బయటకు వచ్చేందుకు అనేక మార్గాలను ఎంచుకొంటున్నారు. అందులో ఒకటి వాకింగ్. అయితే వాకింగ్ మంచిదా? సైక్లింగ్ మంచిదా అంటే.. ?

Walking Or Cycling: వాకింగ్..? సైక్లింగ్..? ఈ రెండింటిలో ఏది మంచిది?

ప్రస్తుత జీవితం తీవ్ర ఒత్తిడితో కూడుకుంది. టెన్షన్ లేకుండా జీవితమే లేదనే పరిస్థితి ఏర్పడింది. దీంతో మానవుడిని వివిధ ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. వీటి నుంచి బయటపడేందుకు పలువురు.. పలు మార్గాలను ఎంచుకుంటున్నారు. అందులోభాగంగా జీవన శైలిని మార్చుకునేందుకు వివిధ మార్గాలను అనుసరిస్తున్నారు. అందులో భాగంగా యోగా, వ్యాయామాలు అంటూ అందుకు సంబంధించిన మార్గాలను ఆశ్రయిస్తున్నాడు. ఆ క్రమంలో వాకింగ్ సైతం చేస్తున్నారు. అయితే వాకింగ్ మంచిదా? సైక్లింగ్ మంచిదా? అంటూ పలువురిలో సందేహం కూడా ఉత్పన్నమవుతుంది. అలాంటి వేళ.. వ్యాయామ నిపుణులు పలు కీలక సూచనలు చేస్తున్నారు.


సైక్లింగ్ కేవలం రవాణ సాధనం మాత్రమే కాదని.. మన శరీరానికి సరిగ్గా సరిపడే యంత్రమని వారు స్పష్టం చేస్తున్నారు. తక్కువ శక్తితో అధిక దూరం ప్రయాణించడానికి ఇది ఉపయోగపడుతుందని వివరిస్తున్నారు.

ప్రతి రోజూ వాకింగ్ కంటే.. సైకిల్ తొక్కడం సులభమని అంటున్నారు. వాకింగ్ కంటే.. సైక్లింగ్ కనీసం నాలుగు రెట్లు అధిక శక్తిని ఇస్తుందని అధ్యయనాలు సైతం చెబుతున్నాయని సోదాహరణగా వివరిస్తున్నారు. అందుకే ప్రపంచంలో నేటికి సైకిళ్లు తొక్కేవారు అత్యధికంగా ఉన్నారని గణాంకాలు కూడా చెబుతున్నాయని అంటున్నారు.


సైక్లింగ్ ఎందుకు సులభమంటే..

మనం నడుస్తున్నప్పుడు లేదా పరిగెత్తినప్పుడు.. మన శరీర బరువును నియంత్రిస్తూ.. మన కాళ్లను ముందుకు చాపుతాం. దీంతో ప్రతి అడుగు.. గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా మన బరువైన కాళ్లను ఎత్తవలసి ఉంటుంది. అందుకు చాలా శక్తి కావాల్సి ఉంటుంది.

అదీకాక నడుస్తున్న సమయంలో.. గంటసేపు చేతులు ఊపుతూ ఉండడం వల్ల శరీరం ఎంత అలసిపోతుంది. కానీ సైకిల్ మీద, కాళ్లు చిన్న.. వృత్తాకార కదలికలతో తిరుగుతాయి. మనం మొత్తం కాళ్ల బరువును ఎత్తడానికి బదులుగా.. మన కాళ్లు, పాదాలు.. చక్రాల రూపంలో తిప్పుతాము. ఇది శక్తిని ఆదా చేస్తుంది.


శక్తి వృధాను నివారిస్తోంది..

నడుస్తున్నప్పుడు, ప్రతి అడుగు నేలతో ఏదో ఒక రకమైన ఘర్షణను సృష్టిస్తోంది. కాలు నేలను తాకినప్పుడు సంభవించే శబ్దం, కదలికలు గమనిస్తే.. శక్తి వృధా అవుతుంది. మనం నడుస్తున్నప్పుడు, మన పాదాలు.. శరీరం కంటే కొంచెం ముందుకు కదులుతాయి. దీని వల్ల మన వేగం ఒక్క క్షణం తగ్గుతుంది. ఈ వేగం తగ్గిన తర్వాత తిరిగి వేగాన్ని పొందడానికి మన కండరాలు మరింత కష్టపడాల్సి ఉంటుంది. కానీ ఈ సమస్యను సైకిల్ చక్రాలు పరిష్కరిస్తుంది. చక్రాలు నేలపై సులభంగా తిరుగుతాయి. ఇక్కడ ఘర్షణతో శక్తి వృధా కాదు. పెడల్స్ నుంచి వచ్చే శక్తి నేరుగా ముందుకు కదలికలతో మార్చబడుతుంది.


కండరాలకు ప్రయోజనం..

మన కండరాలు వేగంగా సంకోచించినప్పుడు.. అవి బలహీనంగా మారతాయి. అంతే కాకుండా అధిక శక్తిని వినియోగాస్తాయి. దీనిని వేగం.. శక్తి సంబంధం అంటారు.


కొన్ని సార్లు నడవడం కూడా మంచిదే ఎందుకంటే..

సైక్లింగ్ ఎల్లప్పుడు ఉత్తమమైనది కాదు.. అంటే కొండ ప్రాంతాలు లేదా ఎత్తైన ప్రాంతాల్లో పైకి వెళ్లే క్రమంలో సైకిల్ తొక్కడం కష్టసాధ్యంగా మారుతోంది. అలాంటి పరిస్థితుల్లో నడకే ఉత్తమం అంటారు.


కండరాల శక్తిని సమర్థవంతమైన కదలికగా మార్చే ద్విచక్ర వాహనం.. సైకిల్. అంతే కాదు.. మన రోజువారీ ప్రయాణాన్ని సులభతరం చేయడమే కాకుండా.. ఆరోగ్యకరమైన, పర్యావరణ అనుకూల జీవనశైలిని సైతం ఇది ప్రోత్సహిస్తుంది. సైకింగ్‌ను ఎంచుకోవడం వల్ల.. మన సమయంతోపాటు. శక్తి , పర్యావరణాన్ని కూడా ఆదా చేసుకోవచ్చునని చెబుతారు.

ఈ వార్తలు కూడా చదవండి..

షాకింగ్ రిపోర్ట్.. పుట్టుకతోనే 41,000 మంది పిల్లలకు గుండె జబ్బులు

ఉపవాసంలో తీసుకోవాల్సిన 5 బెస్ట్ డ్రింక్స్ ఇవే

For More Health News And Telugu News

Updated Date - Sep 23 , 2025 | 09:28 AM