ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

US airfare drop: అమెరికాకు తగ్గిన విమాన చార్జీలు

ABN, Publish Date - Apr 21 , 2025 | 05:04 AM

ఈ వేసవిలో భారత్‌ నుంచి అమెరికా వెళ్లే విమాన చార్జీలు అనూహ్యంగా తగ్గాయి. ట్రంప్‌ పాలనలో తీసుకున్న విధానాల ప్రభావంతో ఈ తగ్గుదల చోటు చేసుకుందని భావిస్తున్నారు.

ఈ వేసవిలో ఢిల్లీ-అమెరికా టికెట్‌ ధరలు 15% పడిపోయిన వైనం.. ట్రంప్‌ విధానాలే కారణం

ముంబై, ఏప్రిల్‌ 20: ఈ వేసవిలో ఆశ్చర్యకరంగా అమెరికాకు విమాన చార్జీలు పడిపోయాయి. అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత అనుసరిస్తున్న విధానాల కారణంగానే ఈ ట్రెండ్‌ చోటుచేసుకుందని అంటున్నారు. ఢిల్లీ-అమెరికా విమానాల చార్జీలు 10 నుంచి 15 శాతం వరకు తగ్గాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్‌-జూన్‌ మధ్య కాలానికి సంబంధించి ఢిల్లీ, ముంబై నుంచి అమెరికాలోని కీలక నగరాలకు విమాన చార్జీల్లో సగటున 5-8 శాతం తగ్గుదల కనిపిస్తోందని ట్రావెల్‌ సంస్థ ‘థామస్‌ కుక్‌ (భారత్‌) అండ్‌ ఎస్‌వోటీసీ ట్రావెల్‌’ ప్రెసిడెంట్‌, గ్రూపు హెడ్‌ ఇండైవర్‌ రస్తోగి పేర్కొన్నారు. శనివారం ఉన్న ధరల ప్రకారం.. మే నెల మఽధ్యలో ముంబై నుంచి న్యూయార్క్‌కు వన్‌వే ప్రయాణానికి టికెట్‌ ధర కనిష్ఠంగా రూ.37 వేలు చూపించడం గమనార్హం. అదేవిధంగా చౌకైన తిరుగు ప్రయాణ చార్జీ రూ.76 వేలుగా ఉంది. అమెరికాలో రెండవ అతిపెద్ద వలస సమాజంగా భారతీయులు ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్లు భారత్‌లోని తల్లిదండ్రులను చూడటానికి లేదా ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు అమెరికాలోని తమ పిల్లలను చూసేందుకు, విద్యాసంస్థలకు వేసవి సెలవుల సీజన్‌లో ప్రయాణాలు చేస్తుంటారు. అదేవిధంగా ఉన్నత విద్య కోసం భారతీయులు భారీగా అమెరికాకు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో అమెరికాకు వెళ్లే విమాన సర్వీసులకు ఏడాది అంతా విపరీతమైన డిమాండ్‌ ఉంటుంది. దీంతో గత కొన్నేళ్లుగా భారత్‌, అమెరికా మధ్య నడిచే విమానాల్లో చార్జీలు కూడా ఎక్కువగా ఉండేవి. అయితే ట్రంప్‌ విధానాలతో ఈ వేసవిలో సీన్‌ మారిపోయింది.


ఇవి కూడా చదవండి:

Ramesh Nagapuri: నేనే తప్పూ చేయలేదు.. సస్పెన్షన్‌పై రమేశ్ నాగపురి రియాక్షన్


Viral Video: వైద్యం కాదు వేధింపు..ప్రభుత్వ ఆస్పత్రిలో వృద్ధుడిని లాక్కెళ్లిన డాక్టర్, సిబ్బంది


Viral News: 70 ఇన్ స్పేస్..అంతరిక్షంలో రోదసీ యాత్రికుడి బర్త్ డే సెలబ్రేషన్

UPSC Recruitment: రూ.25తో ప్రభుత్వ ఉద్యోగానికి గ్రీన్‌సిగ్నల్.. 45 ఏళ్ల వారికీ కూడా ఛాన్స్


Scam Payments: మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్.. జర జాగ్రత్త..

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 21 , 2025 | 05:04 AM