South Carolina Mass Shooting: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. 11 మంది ఆసుపత్రిపాలు
ABN, Publish Date - May 26 , 2025 | 10:47 AM
అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. దక్షిణ కొరియాలోని లిటిల్ రివర్ ప్రాంతంలో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. పలువురు ఆసుపత్రి పాలయ్యారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో ఆదివారం మరోసారి కాల్పుల కలకలం రేగింది. దక్షిణ కెరొలీనాలోని తీర ప్రాంత టౌన్ లిటిల్ రివర్‌లో ఈ ఘటన జరిగింది. రాత్రి 9.30 గంటల సమయంలో రోడ్డు మీద కాల్పులు చోటుచేసుకున్నట్టు తెలిసింది. అయితే, పోలీసులు మాత్రం ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించలేదు. ఇప్పటికే 11 మంది ఆసుపత్రి పాలైనట్టు తెలిసింది. కొందరు తమ వ్యక్తిగత వాహనాల్లో ఆసుపత్రులకు వెళ్లారు.
కాల్పులకు గల కారణాలు, నిందితులు ఎవరూ అన్న వివరాలు ఇంకా తెలియరాలేదు. ఎవరైనా అనుమానితుల్ని విచారిస్తున్నారా అనే విషయాలను కూడా పోలీసులు వెల్లడించలేదు. ఘటనా స్థలంలో పోలీసు వాహనాలు, అంబులెన్స్‌లు కనిపించిన దృశ్యాలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఘటన జరిగిన ప్రాంతాల్లో బోటింగ్ వ్యాపారాలు మాత్రామే ఉన్నాయని స్థానిక మీడియా తెలిపింది.
Also Read:
ఉగ్రవాదంపై యుద్ధం.. భారత్‌కు మద్దతుగా జర్మనీ
ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలకు అమెరికా కారణం.. పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
Read Latest and International News
Updated Date - May 26 , 2025 | 10:48 AM