Operation Spider Web: దాడిచేసిన విమానాలు ధ్వంసం
ABN, Publish Date - Jun 03 , 2025 | 04:45 AM
ఉక్రెయిన్ 'ఆపరేషన్ స్పైడర్ వెబ్' ద్వారా రష్యా 41 దీర్ఘశ్రేణి యుద్ధ విమానాలను ధ్వంసం చేసింది. ఇస్తాంబుల్‌లో జరిగిన శాంతి చర్చలు ఫలితం లేకుండానే ముగిశాయి, యుద్ధ ఖైదీల మార్పిడి విషయంలో మాత్రం ఒప్పందం కుదిరింది.
ఉక్రెయిన్ ‘ఆపరేషన్ స్పైడర్ వెబ్’ టార్గెట్ అదే.. రష్యా టీయూ-22ఎం3, టీయూ-95 బాంబర్లకు చావు దెబ్బ
34% దీర్ఘశ్రేణి క్షిపణి వాహకాలు ధ్వంసం
నష్టం విలువ సుమారు 59 వేల కోట్లు
వెల్లడించిన ఉక్రెయిన్ సైన్యం
మా గడ్డ పైనుంచే దాడి జరిగింది: రష్యా
కీవ్/ఇస్తాంబుల్, జూన్ 2: మూడేళ్లుగా ఉక్రెయిన్‌పై రష్యా ముప్పేట దాడులు చేస్తోంది. దీర్ఘశ్రేణి క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఇందుకోసం తన దీర్ఘశ్రేణి క్షిపణి వాహక యుద్ధ విమానాలు(బాంబర్లు) టీయూ22ఎం3, టీయూ-95, టీయూ-160లను వినియోగిస్తోంది. వీటికి నావిగేషన్ సహకారం అందించేందుకు ఏ-50 అవాక్స్‌ను ఉపయోగించుకుంటోంది. దాంతో ప్రతీకారేచ్చతో రగిలిపోయిన ఉక్రెయిన్.. ఈ యుద్ధ విమానాలను టార్గెట్‌గా చేసుకుంది. అందుకోసం 18 నెలల క్రితం ‘ఆపరేషన్ స్పైడర్ వెబ్’కు శ్రీకారం చుట్టింది. ఆపరేషన్ అమలు బాధ్యతలను సెక్యూరిటీ సర్వీ్‌స(ఎ్‌సబీయూ)కు అప్పగించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్వయంగా ఈ ఆపరేషన్‌ను పర్యవేక్షించారు. తమ ఆపరేషన్‌ను అతి క్లిష్టమైన ఆధునిక యుద్ధ తంత్రంగా పేర్కొంటూనే.. బెలాయా(సైబీరియా సమీపంలో), ఒలేన్యా(ఆర్కిటిక్ సమీపంలో.. కోలా ద్వీపకల్పంలో), ఇవానోవో, డియాగిలెవ్‌లో ఉన్న రష్యన్ ఎయిర్‌బే్‌సల వద్ద 117 ఎఫ్‌పీవీ డ్రోన్లను మోహరించింది. వీటిని రష్యాకు తరలించేందుకు ట్రక్కు డ్రైవర్లు, రష్యన్ భాష తెలిసిన ఉక్రెనియన్లను ఏజెంట్లుగా నియమించింది. గగనతలంలో చొచ్చుకువచ్చే డ్రోన్లను, క్షిపణులను అడ్డుకునే సాంకేతికత రష్యా వద్ద ఉన్న నేపథ్యంలో.. ట్రక్కుల్లో రోడ్డు మార్గాల్లో తన డ్రోన్లను తరలించింది. అంతేకాదు.. ఈ ఆపరేషన్ కోసం శ్రమించిన చివరి ఏజెంట్ కూడా క్షేమంగా ఉక్రెయిన్ భూభాగంలోకి అడుగుపెట్టాకే..
ఆదివారం ఉదయం ఆపరేషన్‌ను అమలు చేసి, 41 యుద్ధ విమానాల(బాంబర్లు)ను ధ్వంసం చేసింది. ఈ విజయంపై ఎస్‌బీయూ చీఫ్ మాలిక్‌ను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అభినందించారు. ఈ సందర్భంగా ఆపరేషన్ వివరాలను బయటి ప్రపంచానికి తెలియజేశారు. ఇన్నాళ్లు తమ ఏజెంట్లు రష్యా ఎఫ్‌ఎ్‌సబీ(నిఘా సంస్థ) ప్రధాన కార్యాలయం సమీపంలోనే మకాం వేశారని వెల్లడించారు. ఉక్రెయిన్ సైన్యం కూడా ఈ ఆపరేషన్ తమకు అతిపెద్ద విజయం అని పేర్కొంది. రష్యా వద్ద సుమారు 120 వరకు దీర్ఘశ్రేణి క్షిపణి వాహక బాంబర్లు ఉన్నాయని.. వాటిల్లో 34ు (41 విమానాలు) ధ్వంసమయ్యాయని తెలిపింది. తమ దాడుల వల్ల రష్యాకు కలిగిన నష్టం అంచనా రూ.59 వేల కోట్లుగా ఉంటుందని వెల్లడించింది. అటు రష్యా కూడా నాలుగు ఎయిర్ బేస్‌లపై ఉగ్రవాద దాడులు జరిగాయని ప్రకటించింది. డ్రోన్లు ఉక్రెయిన్ భూభాగం నుంచి రాలేదని స్పష్టం చేసింది. అవి తమ భూభాగం నుంచే ఎగిరినట్లు పరోక్షంగా అంగీకరించింది. ఆదివారం నాటి ఉక్రెయిన్ ‘ఆపరేషన్ స్పైడర్ వెబ్’కు ప్రతీకారంగా రష్యా తన దాడులను కొనసాగిస్తోంది. అయితే.. సరిహద్దుల్లో ముఖాముఖి ఘర్షణల్లో ఆదివారం ఒక్కరోజే 1,140 మంది రష్యా సైనికులు చనిపోయారని ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది. దీనిపై రష్యా నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
తేలని శాంతి చర్చలు
ఇస్తాంబుల్‌లో రష్యా-ఉక్రెయిన్ మధ్య జరిగిన శాంతి చర్చలు ఎటూ తేలలేదని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. 30 రోజుల కాల్పుల విరమణకు ఉక్రెయిన్ ప్రతిపాదించగా.. 2-3 రోజులకు అయితే సుముఖమని రష్యా వెల్లడించింది. ఈ నెల 20 నుంచి 30 వరకు ఉన్నతస్థాయిలో చర్చలు జరపాలని ఉక్రెయిన్ కోరగా.. రష్యా ఎలాంటి సమాధానమివ్వలేదు. అదేవిధంగా యుద్ధం ప్రారంభంలో డాన్‌బా్‌స(లుహాన్స్క్, డోనెట్స్క్), ఖార్కివ్, మారియుపోల్ వంటి ప్రాంతాల నుంచి రష్యా సైన్యం అపహరించిన చిన్నారుల జాబితాను అందజేసిన ఉక్రెయిన్.. వారిని భేషరతుగా తిరిగి అప్పగించాలని కోరింది. దీనికి కూడా రష్యా అంగీకారం తెలపలేదని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. యుద్ధ ఖైదీల మార్పిడి, యుద్ధంలో అమరుల మృతదేహాల అప్పగింతకు ఇరుదేశాల మధ్య తాజా చర్చల్లో ఏకాభిప్రాయం కుదిరింది. యువ సైనికులను, యుద్ధ ఖైదీలను 1:1 ప్రతిపాదికన 6వేల మందిని అప్పగించుకోవాలని ఇరుదేశాలు అంగీకరించాయి. ఈ విషయాన్ని ఉక్రెయిన్ రక్షణ మంత్రి ఉమెరోవ్ నిర్ధారించారు.
ఇవీ చదవండి:
కేంద్రం హెచ్చరిక.. వెనక్కు తగ్గిన రైడ్ హెయిలింగ్ యాప్స్
పాక్‌కు గూఢచర్యం.. భారత యుద్ధ నౌకల వివరాలను చేరవేసిన ఇంజినీర్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 03 , 2025 | 05:40 AM