Vladimir Putin: పుతిన్ నివాసాలపై దాడికి ఉక్రెయున్ ప్రయత్నం!
ABN, Publish Date - Dec 30 , 2025 | 03:57 AM
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసాలపై దాడికి ఉక్రెయున్ ప్రయత్నించినట్టు సోమవారం ప్రభుత్వం ప్రకటించింది. మాస్కో,...
మాస్కో, డిసెంబరు 29: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసాలపై దాడికి ఉక్రెయున్ ప్రయత్నించినట్టు సోమవారం ప్రభుత్వం ప్రకటించింది. మాస్కో, సెయింట్ పీటర్స్‌బర్గ్‌ల్లోని నివాసాలపై దాడులకు యత్నించిందని తెలిపింది. మాస్కో ఉత్తర భాగంలోని నొవ్‌గొరొడ్‌లో ఉన్న పుతిన్ నివాసంపై ఆదివారం-సోమవారం మధ్యరాత్రి దాడి చేసేందుకు 91 లాంగ్ రేంజ్ డ్రోన్లను ఉపయోగించిందని విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ వెల్లడించారు. అయితే ఎలాంటి నష్టం జరగలేదని, అన్ని డ్రోన్లను కూల్చివేశామని తెలిపారు. శాంతి చర్చలను భగ్నం చేయడానికే ఈ చర్యకు పాల్పడిందని ఆరోపించారు. దాడి విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు పుతిన్ ఫోన్ చేసి చెప్పారని విదేశీ విధానాల సహాయకుడు యూరీ ఉషాకోవ్ చెప్పారు. అయితే, దాడి ఆరోపణలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఖండించారు.
Updated Date - Dec 30 , 2025 | 03:57 AM