ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

US Congress Revolt: ట్రంప్‌ విధానాలపై తిరుగుబాటు

ABN, Publish Date - Dec 14 , 2025 | 04:34 AM

విదేశీ ఉద్యోగులు, వస్తువులపై ఎడాపెడా ఆంక్షలు, సుంకాలు విధిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై ఆ దేశంలోని కాంగ్రెస్‌ సభ్యులు తిరుగుబాటు మొ దలుపెట్టారు.

  • వర్క్‌ పర్మిట్‌లో మార్పులను సవాల్‌ చేసిన 10 మంది అమెరికా సెనేటర్లు

  • హెచ్‌1బీ వీసా ఫీజు పెంపుపై 20 రాష్ట్రాల న్యాయపోరాటం

  • భారత్‌పై 50శాతం సుంకాలను సవాల్‌ చేస్తూ అమెరికా ప్రతినిధుల సభలో ప్రతిపక్ష సభ్యుల తీర్మానం

వాషింగ్టన్‌, డిసెంబరు 13: విదేశీ ఉద్యోగులు, వస్తువులపై ఎడాపెడా ఆంక్షలు, సుంకాలు విధిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై ఆ దేశంలోని కాంగ్రెస్‌ సభ్యులు తిరుగుబాటు మొ దలుపెట్టారు. హెచ్‌1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు ఉన్న ఆటోమెటిక్‌ వర్క్‌ పర్మిట్‌ రెన్యూవల్‌ అవకాశాన్ని ట్రంప్‌ ప్రభుత్వం గత అక్టోబరు 30న రద్దు చేసింది. శరణార్థుల జీవిత భాగస్వాములతోపాటు కొన్నిరకాల హెచ్‌1బీ వీసాదారుల విషయంలో యూఎస్‌ సిటిజన్‌షి్‌ప అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యూఎ్‌ససీఐఎస్‌) ఈ నిర్ణయం తీసుకుంది. అంతకుముందు హెచ్‌1బీ వీసాదారుల జీవి త భాగస్వాములు వర్క్‌ పర్మిట్‌ రెన్యూవల్‌ కోసం చట్టబద్ధంగా గడువులోపు దరఖాస్తు చేసుకుంటే ఎలాంటి దర్యాప్తు, పరిశీలనలు లేకుండా రెన్యూవల్‌ అయ్యేది. ఈ విధానాన్ని ట్రంప్‌ ప్రభుత్వం రద్దుచేసింది. ఈ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ కాలిఫోర్నియా సెనేటర్‌ అలెక్స్‌ పదిల్లా, మరో 9మంది కలిసి సెనేట్‌ (ఎగువసభ)లో కాంగ్రెషనల్‌ రివ్యూ యాక్ట్‌ (సీఆర్‌ఏ) తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ చట్టం ప్రకారం అధ్యక్షుడి నిర్ణయాలను సమీక్షించే అధికారం సభకు ఉంటుంది. ‘అధ్యక్షుడి నిర్ణయం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తంగా మారింది. దేశానికి ఎంతో సేవ చేస్తున్న ఉద్యోగులు నాశనమవుతున్నారు’ అని అలెక్స్‌ పదిల్లా పేర్కొన్నారు.

హెచ్‌1బీ వీసా ఫీజు పెంపుపై న్యాయపోరాటం

విదేశీ వృత్తి నిపుణులకు ఇచ్చే హెచ్‌1బీ వీసాల ఫీజును గత సెప్టెంబరు 21నుంచి ట్రంప్‌ ప్రభుత్వం ఏకంగా లక్ష డాలర్ల (దాదాపు రూ.90 లక్షలు)కు పెంచిన విషయం తెలిసిందే. అంతకుముందు అది 2 వేల నుంచి 5వేల డాలర్ల మధ్య ఉండేది. ట్రంప్‌ నిర్ణయంతో అమెరికాకు అవసరమైన విదేశీ వృత్తి నిపుణులు అక్కడికి వెళ్లలేని పరిస్థితి వచ్చింది. దీంతో ఈ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ కాలిఫోర్నియా రాష్ట్రం నేతృత్వంలో 20రాష్ట్రాలు కలిసి బోస్టన్‌ ఫెడరల్‌ కోర్టులో కేసు వేసి న్యాయపోరాటానికి దిగాయి. ‘ట్రంప్‌ నిర్ణయం వల్ల అమెరికాకు కీలకమైన టీచర్లు, వైద్యులు, పరిశోధకులు, నర్సులు తదితర విభాగాల్లో నిపుణులైన విదేశీ ఉద్యోగుల కొరత ఏర్పడింది’ అని కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌ రాబ్‌ బొంటా ఆరోపించారు.

భారత్‌పై సుంకాలను వ్యతిరేకిస్తూ తీర్మానం

అమెరికాకు ఎగుమతి అయ్యే భారతీయ వస్తువులపై ట్రంప్‌ 50ు ప్రతీకార సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ఈ సుంకాల వల్ల అమెరికా ప్ర జలే నష్టపోతున్నారని, వీటిని వెంటనే ఉపసంహరించుకోవాలని హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌(దిగువ సభ)లో డెమోక్రాటిక్‌ సభ్యులు రాజా కృష్ణమూర్తి, డెబోరా రాస్‌, మార్క్‌ వీసే ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సుంకాలు చట్టవ్యతిరేకమని వారు ఆరోపించారు.

Updated Date - Dec 14 , 2025 | 04:35 AM