Cease Fire Putin: ఉక్రెయిన్‌తో కాల్పులపై రష్యా అధ్యక్షుడి తొలి స్పందన ఏంటంటే..
ABN, Publish Date - Mar 13 , 2025 | 11:37 PM
కాల్పుల విరమణ తనకు అంగీకారమే కానీ ఈ ఒప్పందం అమలుకు సంబంధించిన వివరాలపై పూర్తి స్పష్టత రావాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ గురువారం పత్రికా సమావేశంలో వ్యాఖ్యానించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణ ఒప్పందంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణకు అంగీకరిస్తామన్న ఆయన ఈ ఒప్పందాన్ని ఎలా అమలు చేస్తారన్న దానిపై పూర్తి వివరాలు అవసరమని అభిప్రాయపడ్డారు. 30 రోజుల పాటు కాల్పుల విరమణకు సంబంధించి అమెరికా, ఉక్రెయిన్‌లు రూపొందించిన ప్లాన్‌ను అమెరికా రాయబారి పుతిన్ ముందు ఉంచనున్నారన్న వార్తల నడుమ ఆయన తొలిసారిగా స్పందించారు.
Pak Train Hijack Taliban: పాక్ రైలు హైజాకింగ్.. తాలిబాన్ల కీలక ప్రకటన
‘‘కాల్పులు విరమించాలన్న ప్రతిపాదన మాకు అంగీకారమే. అయితే, ఈ ఒప్పందం.. దీర్ఘకాలికంగా శాంతి నెలకొల్పడంతో పాటు యుద్ధానికి గల మూల కారణాలపై కూడా దృష్టి పెట్టాలి. ఒప్పందానికి సంబంధించిన సున్నితమైన వివరాలు చాలా ముఖ్యం. అసలు మేము 30 రోజుల పాటు కాల్పుల విరమణ ప్రకటిస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? క్షేత్రస్థాయిలో ఉన్న వారు ఎటువంటి ఎటువంటి ఘర్షణలకు తావు లేకుండా వెనక్కు మళ్లుతారా? ఈ వ్యవహారాన్ని పర్యవేక్షించేది ఎవరు? ఇవన్నీ చాలా ముఖ్యమైన ప్రశ్నలు. అయితే, ఈ విషయమై అమెరికా వారితో చర్చించాల్సి ఉంది. బహుశా ట్రంప్‌కు ఫోన్ చేసి విషయాలపై మాట్లాడొచ్చు’’ అని మీడియా సమావేశంలో పుతిన్ పేర్కొన్నారు.
Russia Ukraine: కాల్పుల విరమణకు ఉక్రెయిన్ సై
యుద్ధ క్షేత్రంలో రష్యా సేనలు ముందు వెళుతున్నాయని పుతిన్. సైన్యం సాధించే పురోగతిని బట్టి తదుపరి చర్యలు ఉంటాయని తెలిపారు. కురస్క్ ప్రాంతంలో ఉక్రెయిన్ సేనలను వెళ్లగొట్టే పనిలో ఉన్నామని చెప్పారు.
అయితే, కాల్పుల విరమణతో ఉక్రెయిన్‌కు తాత్కాలిక ఊరట మాత్రమే లభిస్తుందని రష్యా వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే కుర్కస్క్ ప్రాంతంలోని సుద్జా అనే టౌన్‌ను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపాయి. అయితే, సరిహద్దు ప్రాంతాలపై ఉక్రెయిన్ సేనలు క్రమంగా పట్టుకోల్పోతున్నాయని కొందరు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. రష్యాతో చర్చల్లో తమకు కీలక ఆయుధంగా కరుస్క్ ప్రాంతం ఉపయోగపడుతుందని ఉక్రెయిన్ మొదట్లో భావించిన రష్యా తాజా దూకుడుతో పరిస్థితి మరో మలుపు తిరిగింది.
Read Latest and International News
Updated Date - Mar 13 , 2025 | 11:38 PM