ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

UK Supreme Court: మహిళ అంటే

ABN, First Publish Date - 2025-04-21T04:53:37+05:30

పుట్టుకతో ఉన్న లింగాన్ని ఆధారంగా చేసుకుని "మహిళ" నిర్వచనాన్ని నిర్ధారించిన బ్రిటన్‌ సుప్రీంకోర్టు తీర్పుపై ట్రాన్స్‌జెండర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లండన్‌లో వేలాది మంది భారీగా ర్యాలీ నిర్వహించి తమ హక్కులు దూరమవుతాయన్న ఆందోళన వ్యక్తం చేశారు.

బ్రిటన్‌ సుప్రీంకోర్టు తీర్పుపై నిరసన వెల్లువ

హక్కులు కోల్పోతామని ట్రాన్స్‌జెండర్ల ఆందోళన..వేలాదిమంది ర్యాలీ

లండన్‌, ఏప్రిల్‌ 20: మహిళ నిర్వచనం గురించి బ్రిటన్‌ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై నిరసన వెల్లువెత్తింది. లండన్‌లోని పార్లమెంటు స్క్వేర్‌ వద్ద ఆదివారం వేలాది మంది ట్రాన్స్‌జెండర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. పుట్టుకతో ఉన్న లింగం ఆధారంగానే మహిళగా పరిగణించాలని, లింగమార్పిడి చేయించుకున్నవారికి ఈ నిర్వచనం వర్తించదని బ్రిటన్‌ సుప్రీంకోర్టు గత బుధవారం తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు వల్ల తాము హక్కులను కోల్పోతామని ఆందోళనకు గురైన ట్రాన్స్‌జెండర్లు మూకుమ్మడిగా ఆందోళనకు దిగారు. మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునే గదులు, ఆస్పత్రి వార్డులు తదితర సేవలను వినియోగించుకునే విషయంలో ఈ తీర్పు ప్రభావం చూపనుందని వారంతా ఆందోళన చెందుతున్నారు. పుట్టుకతో ఉన్న లింగం ఆధారంగానే ఈ సేవలన్నీ వర్తిస్తాయని కోర్టు పేర్కొనడమే దీనికి కారణం. ఈ తీర్పు అనంతరం స్ర్తీల మరుగుదొడ్లను లింగమార్పిడి మహిళలు వినియోగించుకోలేరని, ఆస్పత్రిలోని మహిళా వార్డులు, మహిళా క్రీడా బృందాల్లోనూ వారికి చోటు దక్కకపోవచ్చని సమానత్వ-మానవ హక్కుల కమిషన్‌ ఆందోళన వ్యక్తం చేసింది. స్కాట్లాండ్‌ పాలక మండళ్లలో మహిళలకు 50ు రిజర్వేషన్లు కల్పిస్తూ 2018లో స్కాట్లాండ్‌ పార్లమెంటు చేసిన చట్టం నేపథ్యంలోనే తాజా తీర్పు వెలువడింది. ట్రాన్స్‌జెండర్‌ మహిళలు కూడా లింగనిర్ధారణ సర్టిఫికెట్‌తో ఆ కోటాను వినియోగించుకోవచ్చని పార్లమెంటు పేర్కొనడంపై కోర్టు విభేదించింది. లింగ నిర్ధారణ సర్టిఫికెట్ల వల్ల స్ర్తీ, పురుష నిర్వచనాల్లో గందరగోళం నెలకొందన్న కోర్టు.. 2010 సమానత్వ చట్టం పేర్కొన్న వివక్ష వ్యతిరేక నిబంధనల్లో పుట్టుకతో వచ్చిన లింగాన్నే పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టీకరించినట్టు తెలిపింది.


ఇవి కూడా చదవండి:

Ramesh Nagapuri: నేనే తప్పూ చేయలేదు.. సస్పెన్షన్‌పై రమేశ్ నాగపురి రియాక్షన్


Viral Video: వైద్యం కాదు వేధింపు..ప్రభుత్వ ఆస్పత్రిలో వృద్ధుడిని లాక్కెళ్లిన డాక్టర్, సిబ్బంది


Viral News: 70 ఇన్ స్పేస్..అంతరిక్షంలో రోదసీ యాత్రికుడి బర్త్ డే సెలబ్రేషన్

UPSC Recruitment: రూ.25తో ప్రభుత్వ ఉద్యోగానికి గ్రీన్‌సిగ్నల్.. 45 ఏళ్ల వారికీ కూడా ఛాన్స్


Scam Payments: మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్.. జర జాగ్రత్త..

Read More Business News and Latest Telugu News

Updated Date - 2025-04-21T04:53:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising