Pope Francis Funeral: శనివారం పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు
ABN, Publish Date - Apr 23 , 2025 | 03:44 AM
పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు ఈ శనివారం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు వాటికన్ ప్రకటించింది. ఆయన భౌతికకాయాన్ని సెయింట్ పీటర్స్ బాసిలికాలో ప్రజల సందర్శనార్థం ఉంచేందుకు బుధవారం నిర్ణయం తీసుకున్నారు.
వాటికన్ సిటీ, ఏప్రిల్ 22: కేథలిక్ పవిత్ర గురువు పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు ఇటలీ కాలమానం ప్రకారం శనివారం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు వాటికన్ ప్రకటించింది. అంతిమ సంస్కారాలు ఎప్పుడు నిర్వహించాలనే అంశంతో పాటు తదుపరి పోప్‌ను ఎన్నుకునే ప్రక్రియ ప్రారంభంపై అందుబాటులో ఉన్న కార్డినల్స్‌తో మంగళవారం కీలక సమావేశం జరిగింది. బుధవారం నుంచి ఫ్రాన్సిస్ భౌతికకాయాన్ని సెయింట్ పీటర్స్ బాసిలికా చర్చ్‌లో ప్రజల సందర్శనార్థం ఉంచాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అలాగే పోప్ భౌతికకాయం ఫొటోలను కూడా వాటికన్ మొదటిసారిగా విడుదల చేసింది. గతంలో మరణించిన పోప్‌ల అంత్యక్రియల సుదీర్ఘ క్రతువుకు భిన్నంగా అతి సాధారణంగా నిర్వహించాలని పోప్ కోరుకున్నారు. తనను ఇతర పోప్‌లను ఖననం చేసిన సెయింట్ పీటర్స్ బాసిలికాలో కాకుండా వాటికన్ వెలుపల ఉన్నసెయింట్ మేరీ మేజర్ బాసిలికాలో పూడ్చిపెట్టాలన్న ఆయన కోరికకు అనుగుణంగానే అంత్యక్రియల విధానాన్ని మార్చారు.
Updated Date - Apr 23 , 2025 | 03:45 AM